News September 2, 2025

7న వాడపల్లిలో దర్శనాల నిలిపివేత

image

కోనసీమ తిరుమలగా పేరొందిన వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 7వ తేదీ ఆదివారం దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ చక్రధరరావు తెలిపారు. ఆ రోజు రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనున్నందున మధ్యాహ్నం ఒంటి గంటకు ఆలయాన్ని మూసివేస్తామన్నారు. సంప్రోక్షణ, పూజల అనంతరం సోమవారం ఉదయం నుంచి యథావిధిగా దర్శనాలు పునఃప్రారంభమవుతాయని ఆయన పేర్కొన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

Similar News

News September 2, 2025

రేప్ కేసులో అరెస్టు.. పోలీసులపై MLA కాల్పులు

image

పంజాబ్ సానౌర్ నియోజకవర్గ AAP MLA హర్మీత్ సింగ్ పతాన్‌మజ్రా పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్నారు. రేప్ కేసులో అరెస్టైన ఆయన్ను స్థానిక స్టేషన్‌కు తరలించారు. అక్కడ తన అనుచరులతో కలిసి ఆయన పోలీసులపై కాల్పులు జరిపి పరారయ్యారు. ఈ కాల్పుల్లో ఒక పోలీసుకు గాయాలయ్యాయి. పారిపోయే క్రమంలో మరో అధికారిని కారుతో గుద్దినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కోసం పోలీసులు గాలిస్తున్నారు.

News September 2, 2025

వైఎస్ జగన్‌పై లోకేశ్ వ్యంగ్యాస్త్రాలు

image

AP: మాజీ సీఎం జగన్ పులివెందుల పర్యటనపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ‘జగన్‌ను కలవడానికి VIP పాస్‌లు’ అనే వార్తలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘ఓరి నీ పాసుగాల! సినిమా ఫంక్షన్లకు VIP పాసులు విన్నాం గానీ.. సొంత నియోజకవర్గంలో సొంత పార్టీ కార్యకర్తలను కలవడానికి VIP పాసులు ఏందయ్యా? ఎప్పుడూ వినలే..! చూడలే..!’ అని సెటైరికల్ ట్వీట్ చేశారు.

News September 2, 2025

చింతకొమ్మదిన్నె: ‘విద్యార్థులతో ముచ్చటించిన మంత్రి లోకేశ్

image

చింతకొమ్మదిన్నె మండలంలో ఏర్పాటు చేసిన స్మార్ట్ కిచెన్‌ను మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. అనంతరం ఆయన స్థానిక పాఠశాల విద్యార్థులతో ముచ్చటిస్తూ, వారి ఆశయాలు, లక్ష్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యకు ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. విద్యార్థుల సందేహాలకు సమాధానమిస్తూ, ప్రభుత్వ కార్యక్రమాలు గురించి వివరించారు. విద్యార్థులు మంత్రి మాటలతో ఉత్సాహం పొందారు.