News March 2, 2026
7 ఎమిరేట్స్ సమాఖ్య దేశమే UAE

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబి. <<19276017>>UAE<<>> 7 ఎమిరేట్స్ అబుదాబి, దుబాయ్, షార్జా, అజ్మాన్, ఉమ్ అల్ క్వైన్, రస్ అల్ ఖైమా, ఫుజైరాల సమాఖ్య దేశం. 1971లో 6 ఎమిరేట్స్ ఓ గ్రూపుగా ఏర్పడగా 1972లో ఫుజైరా జాయిన్ అయింది. వీటికి సపరేట్‌గా ఏడుగురు చీఫ్‌లున్నా అబుదాబి అధినేతే UAEకి అధ్యక్షుడిగా ఉంటారు. ఈ దేశ విస్తీర్ణంలో పెద్దదై(84-87%)న అబుదాబి, ప్రపంచంలోనే మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ దుబాయ్‌లదే UAEలో ఆధిపత్యం.
Similar News
News March 3, 2026
రూ.1000 కోట్లతో ప్రభుత్వ ఆఫీసులకు సొంత భవనాలు!

TG: రాష్ట్రంలోని అద్దె గృహాల్లో ఉన్న ఆఫీసులకు దశలవారీగా సొంత భవనాలు నిర్మించాలని GOVT నిర్ణయించింది. తద్వారా చెల్లిస్తున్న కోట్లాది రూపాయలు అద్దెల భారాన్ని తగ్గించుకోనుంది. మండలం నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఆఫీసులు అద్దె భవనాల్లో ఉండడానికి వీల్లేదని, వాటికి నిర్ణీత విస్తీర్ణంలో సొంత భవనాలు నిర్మించాలని CM ఇప్పటికే అధికారులను ఆదేశించారు. వచ్చే బడ్జెట్లో వీటికి ₹1000 CR నిధులు కేటాయించనున్నారు.
News March 3, 2026
BJP ఆగడాలను మనం అడ్డుకోవాలి: రాహుల్

TG: BJP ప్రజల మధ్య విభేదాలు సృష్టించి అధికారంలోకి రావాలని చూస్తోందని రాహుల్ గాంధీ విమర్శించారు. కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండి BJP ఆగడాలను అడ్డుకొని దేశాన్ని రక్షించాలని వికారాబాద్‌లో DCC అధ్యక్షులకు దిశానిర్దేశం చేశారు. ‘చేయి గుర్తు అంటే అభయ ముద్ర. అన్ని మతాల చిహ్నం కూడా అభయ ముద్రనే. అదే మన సిద్ధాంతం. కాంగ్రెస్ అంటే శాంతి, అహింస, సత్య వాక్కు. వీటితోనే మనం ప్రజల్లోకి వెళ్లాలి’ అని సూచించారు.
News March 2, 2026
ప్రధాని పదవిపై తొలిసారి రాహుల్ సానుకూల సంకేతాలు!

TG: ప్రధానమంత్రి పదవి చేపట్టడంపై తొలిసారి రాహుల్ గాంధీ సానుకూల సంకేతాలు ఇచ్చారు. వికారాబాద్‌లో జరిగిన DCC అధ్యక్షుల శిక్షణ శిబిరంలో ‘ఈ దేశం కోసం రాహుల్ ప్రధాని కావాల్సిందే’ అని సీఎం రేవంత్ కోరారు. అందుకు స్పందించిన రాహుల్ ‘మోదీపై యుద్ధానికి సిద్ధం’ అని తల ఊపుతూ వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి పదవి అలంకరణ కాదని, ఈ దేశ ప్రజలకు సేవ చేయడం కోసమేనని రేవంత్ తెలిపారు.


