News May 21, 2024

రూ.7.08కోట్ల విదేశీ నిధులు సేకరించిన ఆప్: ఈడీ

image

ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు విదేశీ నిధుల సేకరణలో అవకతవకలకు పాల్పడ్డారని ఈడీ ఆరోపించింది. 2014 నుంచి 2022 వరకు రూ.7.08 కోట్ల విదేశీ నిధులను పొందినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు తెలియజేసింది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం, ఇండియన్ పీనల్ కోడ్‌లను ఆప్ ఉల్లంఘించినట్లు పేర్కొంది. కెనడాలో సేకరించిన నిధులను ఆ పార్టీ ఎమ్మెల్యే దుర్గేశ్ పాఠక్‌తో సహా మరికొందరు తమ స్వప్రయోజనాలకు వాడుకున్నారని తెలిపింది.

Similar News

News November 22, 2025

మోక్షజ్ఞ ఎంట్రీపై బాలయ్య అప్డేట్

image

నటసింహం నందమూరి బాలకృష్ణ తన కుమారుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై మరోసారి స్పష్టతనిచ్చారు. గోవాలో జరిగిన IFFI వేడుకల్లో మాట్లాడుతూ ‘ఆదిత్య 369’ సీక్వెల్‌ ‘ఆదిత్య 999 మ్యాక్స్’లో మోక్షజ్ఞ తనతో కలిసి నటించనున్నట్లు ధ్రువీకరించారు. ఈ ప్రకటనతో నందమూరి అభిమానుల్లో జోష్ నెలకొంది. గతంలో మోక్షజ్ఞ ప్ర‌శాంత్ వర్మ ద‌ర్శ‌క‌త్వంలో డెబ్యూ చేస్తాడని అనుకున్నా ఆ ప్రాజెక్టు గురించి ఎటువంటి అప్‌డేట్స్ లేవు.

News November 22, 2025

పార్లమెంటులో ‘అమరావతి’ బిల్లు: పెమ్మసాని

image

AP: రాష్ట్ర రాజధానిగా అమరావతిని గుర్తించే గెజిట్ ప్రక్రియ తుది దశకు చేరుకున్నట్లు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందన్నారు. CRDA కార్యాలయంలో మాట్లాడుతూ ‘రాజధాని రైతులకు 98% ప్లాట్ల పంపిణీ పూర్తయింది. మిగిలిన సమస్యలనూ త్వరలో పరిష్కరిస్తాం. రాబోయే 15ఏళ్లలో జనాభా పెరుగుదల అంచనాల ప్రకారం సదుపాయాలు కల్పిస్తాం’ అని వివరించారు.

News November 22, 2025

బిట్స్ పిలానీలో ఉద్యోగాలు

image

హైదరాబాద్‌లోని బిట్స్ పిలానీ 4 కేర్ టేకర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈనెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.bits-pilani.ac.in/