News March 16, 2024
ప్రణీత్‌రావుకు 7 రోజుల పోలీస్ కస్టడీ

TS: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టైన మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావును పోలీసుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. మార్చి 17వ తేదీ నుంచి 23వ తేదీ వరకు కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. విచారణలో భాగంగా ఎవరి ఆదేశాలతో ఫోన్లు ట్యాపింగ్ చేశారు? ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు? ఆధారాలు ఎందుకు ధ్వంసం చేశారనే వివరాలను పోలీసులు రాబట్టనున్నారు.
Similar News
News April 4, 2025
భారీగా తగ్గిన బంగారం ధరలు

ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి రూ.1,740 తగ్గి రూ.91,640కి చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రూ.1,600 తగ్గి రూ.84వేలుగా పలుకుతోంది. అటు వెండి కేజీ రూ.4,000 తగ్గింది. ప్రస్తుతం కేజీ సిల్వర్ రేటు రూ.1,08,000కు చేరింది.
News April 4, 2025
గోవాకు జైస్వాల్.. అతనితో వివాదమే కారణం?

రహానేతో వివాదం వల్లే జైస్వాల్ <<15971972>>ముంబైను వీడాలని<<>> నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 2022 రంజీ మ్యాచ్‌లో బ్యాటర్‌ను స్లెడ్జింగ్ చేస్తున్నాడని జైస్వాల్‌ను రహానే ఫీల్డ్ నుంచి పంపించారు. ఇదే వీరి మధ్య వివాదానికి బీజం వేసినట్లు సమాచారం. షాట్ సెలక్షన్, జట్టుపై నిబద్ధత పట్ల రహానే తరచూ ప్రశ్నించడమూ జైస్వాల్‌కు నచ్చలేదని.. 2025 రంజీ మ్యాచ్‌లో రహానే కిట్‌ను జైస్వాల్ తన్నడంతో వివాదం మరింత ముదిరిందని తెలుస్తోంది.
News April 4, 2025
భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్స్

భారత స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 691 పాయింట్లు కోల్పోయి 75,603, నిఫ్టీ 278 పాయింట్ల నష్టంతో 22,972 వద్ద ట్రేడవుతున్నాయి. HDFC, TCPL, HUL, AIRTEL షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ONGC, TATA MOTORS, CIPLA షేర్లు ఎరుపెక్కాయి.