News February 1, 2025
ఏపీకి అదనంగా మరో 7 ఎయిర్‌పోర్టులు: రామ్మెహన్

AP ప్రజల తరఫున నిర్మలకు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ధన్యవాదాలు తెలిపారు. YCP ప్రభుత్వంలో జల్ జీవన్ నిధుల దుర్వినియోగం జరిగిందని ఆరోపించారు. 2028 వరకు జల్ జీవన్ పథకం పొడిగింపుతో APకి మేలు జరుగుతుందని ఆయన వివరించారు. రాష్ట్రానికి సముచిత న్యాయం చేసేలా టీమ్ వర్క్ చేస్తామన్నారు. ఎంత వీలైతే అంత రాష్ట్రానికి నిధులు తెస్తామని చెప్పారు. రాష్ట్రంలో అదనంగా మరో 7 ఎయిర్‌పోర్టులు రాబోతున్నాయని తెలిపారు.
Similar News
News November 24, 2025
Free movies, Free downloads ప్రమాదకరం: సజ్జనార్

అనుమానాస్పద లింక్స్, ఫ్రీ మూవీ సైట్స్‌ను క్లిక్ చేసి సైబర్ నేరగాళ్ల వలలో పడొద్దని HYD CP సజ్జనార్ హెచ్చరించారు. అలాంటి వాటిపై క్లిక్ చేస్తే అకౌంట్స్ హ్యాక్ చేసి డేటాను దొంగిలిస్తారని, తర్వాత బ్లాక్‌మెయిల్‌కు దిగుతారని పేర్కొన్నారు. ‘Free movies, Free downloads అంటూ ఉచితమనిపించే కంటెంట్ ప్రమాదకరం. ఇలాంటి ఫేక్ సైట్లు, యాప్స్ ఎప్పుడూ క్లిక్ చేయొద్దు. స్ట్రాంగ్ పాస్‌వర్డ్స్ పెట్టుకోండి’అని సూచించారు.
News November 24, 2025
314 పరుగుల ఆధిక్యంలో సౌతాఫ్రికా

భారత్-సౌతాఫ్రికా రెండో టెస్టులో మూడో రోజు ఆట ముగిసింది. తొలి ఇన్నింగ్సులో భారత్ 201 పరుగులకు <<18375894>>ఆలౌటైంది<<>>. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన RSA ఆట ముగిసే సమయానికి 26/0 రన్స్ చేసింది. బవుమా సేన 314 పరుగుల ఆధిక్యంలో ఉంది.
News November 24, 2025
ధర్మేంద్ర ఆస్తి ఎంతో తెలుసా?

బాలీవుడ్ దిగ్గజ నటుల్లో ఒకరిగా వెలుగొందిన ధర్మేంద్ర అనారోగ్య కారణాలతో మరణించారు. ఆయన ఆస్తి విలువ రూ.335-450 కోట్ల మధ్య ఉంటుందని జాతీయ మీడియా పేర్కొంది. సినిమాలు, రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాల ద్వారా ఇంత మొత్తం ఆర్జించినట్లు తెలిపింది. ముంబై-పుణె మధ్యలో ఉండే లోనావాలాలో 100 ఎకరాల ఫాంహౌజ్ ఉందని పేర్కొంది. ఆయన సోషల్ మీడియా అకౌంట్‌లో ఎక్కువగా ఈ ఫౌంహౌజ్‌లో చేసే వ్యవసాయం వీడియోలను పోస్ట్ చేయడం గమనార్హం.


