News January 4, 2025
ఏపీలో 7 కొత్త ఎయిర్‌పోర్టులు

ఏపీలో కొత్తగా కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, నాగార్జునసాగర్, తుని-అన్నవరం, ఒంగోలులో 7 ఎయిర్‌పోర్టులు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. శ్రీకాకుళంలో ఎయిర్‌పోర్టు ఫీజిబిలిటీ సర్వే పూర్తైంది. మిగతాచోట్ల సర్వే చేయాలని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుతో జరిగిన సమీక్షలో CM చంద్రబాబు కోరారు. అటు గన్నవరంలో కొత్త టెర్మినల్ భవనాన్ని కూచిపూడి నృత్యం, అమరావతి స్తూపం థీమ్‌తో నిర్మించనున్నారు.
Similar News
News February 6, 2026
పచ్చిపేడను ఎలా మగ్గబెడితే మంచిది?

ముందుగా పశువుల నుంచి వచ్చే పేడను ఒక దగ్గర వేయాలి. అందులో కాస్త తేమ ఉండేందుకు కొద్దిగా నీళ్లను చల్లుతూ ఉండాలి. పేడ బాగా మగ్గాలంటే కుప్పపై గాలి చొరబడకుండా ప్లాస్టిక్ కవరును గట్టిగా కప్పి ఉంచాలి. ఇలా 2 నుంచి 3 నెలల పాటు ఉంచి మధ్యలో అప్పుడప్పుడు కుప్పను పైకి కిందకు తిరగేయాలి. దీని వల్ల ఎరువు సమానంగా కుళ్లి మగ్గుతుంది. ఇలా బాగా మగ్గిన పశువుల ఎరువును వాడితే నేలసారం పెరిగి అధిక దిగుబడులు వస్తాయి.
News February 6, 2026
కాలతన్నితే పెరిగేది పుచ్చకాయ, కుళ్లేది గుమ్మడికాయ

పుచ్చ పంటను సాగు చేసేటప్పుడు కాయ తీగను కాలితో తంతే అది మరింత బలంగా వ్యాపిస్తుందని ఒక నమ్మకం. అదే గుమ్మడికాయకు చిన్న దెబ్బ తగిలినా లోపల కుళ్లి పోతుందట. నిజ జీవితంలో కూడా కొందరు వ్యక్తులు కష్టాలు, విమర్శలు ఎదురైనా వాటిని సానుకూలంగా మార్చుకొని పుచ్చకాయలా మరింత ఉత్సాహంతో ఎదుగుతారు. మరి కొందరు వ్యక్తులు చిన్నపాటి కష్టాలకే గుమ్మడికాయలా కుంగిపోయి, ధైర్యం కోల్పోతారని ఈ సామెత చెబుతుంది.
News February 6, 2026
శుక్ర జపంతో శుక్ర దోషం దూరం!

శుక్ర జపం అంటే శుక్రుడికి సంబంధించి ‘ఓం శుక్రాయ నమః’ అనే మంత్రాన్ని పఠించే ప్రక్రియ. ఇది మనస్సును శాంతపరుస్తుంది. ఈ జప సాధనతో మెదడులోని ఆందోళనలు తగ్గుతాయి. సహనం పెరుగుతుంది. ప్రేమ గుణం వృద్ధి చెందుతుంది. క్రమం తప్పకుండా ఈ మంత్రాన్ని జపిస్తే జాతకంలోని శుక్రుడి ప్రభావం బలపడుతుందని నమ్మకం. సంబంధ బాంధవ్యాల్లో మధురత పెరుగుతుందని చెబుతారు. మానసికంగా సిద్ధం చేసి, సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనేలా చేస్తుంది.


