News October 21, 2025
కొత్తగా 7 డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు: సత్యకుమార్ యాదవ్

AP: కిడ్నీ రోగుల కోసం రాష్ట్రంలో కొత్తగా 7 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటించారు. S.కోట, భీమవరం, పీలేరు ఏరియా ఆసుపత్రులలో, సీతంపేట, వెంకటగిరి, అద్దంకి, సున్నిపెంట సీహెచ్సీల్లో ఇవి ఏర్పాటవుతాయని వివరించారు. వీటిలో రోజూ 3 సెషన్లలో 15 మంది చొప్పున రోగులకు రక్తశుద్ధి జరుగుతుందన్నారు. PMNDP కింద ఒక్కో కేంద్రంలో ₹75 లక్షలతో యంత్రాలు, పరికరాలు సమకూరుతాయని తెలిపారు.
Similar News
News October 21, 2025
30 ఏళ్లకు పైగా ఒకే సినిమా… అయినా తగ్గని క్రేజ్

నేడు ఏ సినిమా అయినా వారం, పది రోజులు ఆడటమే కష్టం. అలాంటిది ఓ థియేటర్లో 30 ఏళ్లకు పైగా ఒకే సినిమా వేస్తున్నారంటే ఆశ్చర్యమే. ముంబైలోని మరాఠా మందిర్లో ‘దిల్‌వాలే దుల్హనియే లే జాయేంగే’ రిలీజైనప్పటి నుంచి ప్రదర్శితమవుతోంది. 1995 OCT20న ఇది రిలీజైంది. ‘30సార్లు ఈ మూవీ చూశా. ఇంకా చూస్తా’ అని 60 ఏళ్ల షక్రీ అన్నారు. 1975లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ ‘షోలే’ 5ఏళ్లు ఆడగా DDLJ దాన్ని అధిగమించింది.
News October 21, 2025
ప్రపంచ నేతలు.. ఆసక్తికర విషయాలు!

అగ్రదేశాలకు అధినేతలుగా పని చేసిన/చేస్తున్న శక్తిమంతమైన నేతలు వాళ్లు. తమ పాలనతో చెరగని ముద్ర వేశారు. వారి గతంలోని ఆసక్తికర విషయాలు.. *మన్మోహన్ సింగ్-పబ్లిక్ సర్వీసులోకి రాకముందు ప్రొఫెసర్. *ఏంజెలా మెర్కెల్-క్వాంటమ్ కెమిస్ట్రీలో డాక్టరేట్. *జెలెన్‌స్కీ-కమెడియన్. *విన్‌స్టన్ చర్చిల్-చిత్రకారుడు. *బైడెన్-లైఫ్‌గార్డుగా పని చేశారు. *ఒబామా-ఐస్ క్రీమ్ స్కూపర్‌గా పని చేశారు. పుతిన్-ఇంటెలిజెన్స్ ఆఫీసర్.
News October 21, 2025
వన్డే క్రికెట్ చరిత్రలో తొలిసారి

ODI క్రికెట్‌లో వెస్టిండీస్ అరుదైన రికార్డు సృష్టించింది. ఇవాళ బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచులో మొత్తం 50 ఓవర్లు స్పిన్నర్లతోనే బౌలింగ్ చేయించింది. ఫుల్ మెంబర్ జట్లలో ఇలా ఇన్నింగ్స్ అంతా స్పిన్నర్లే బౌలింగ్ చేయడం ఇదే తొలిసారి. కాగా ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన BAN 213/7 స్కోర్ చేయగా, అనంతరం విండీస్ కూడా 50 ఓవర్లలో 213/9 స్కోర్ చేయడంతో మ్యాచ్ టై అయింది. సూపర్ ఓవర్‌లో విండీస్ విజయం సాధించింది.