News November 14, 2024
7 ఓవర్ల మ్యాచ్.. పాక్ బోల్తా

ఆస్ట్రేలియా, పాకిస్థాన్ మధ్య తొలి T20ని వర్షం కారణంగా 7 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన AUS 93 రన్స్ చేసింది. మ్యాక్స్‌వెల్ 3 సిక్సర్లు, 5 ఫోర్లతో 19 బంతుల్లోనే 43 రన్స్‌తో విధ్వంసం సృష్టించారు. 94 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన PAK జట్టులో ఫర్హాన్(8), రిజ్వాన్(0), బాబర్(3), ఉస్మాన్(4), సల్మాన్(4), ఇర్ఫాన్(0) అట్టర్ ఫ్లాప్ అయ్యారు. దీంతో PAK 64 రన్స్‌కే పరిమితమైంది.
Similar News
News November 18, 2025
బనకచర్ల పేరు మార్చి అనుమతులకు ఏపీ యత్నం: ఉత్తమ్

SC స్టే ఉన్నా ఆల్మట్టి ఎత్తు పెంచేందుకు కర్ణాటక ప్రయత్నిస్తోందని TG మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఎత్తు పెంచొద్దని కోర్టు చెప్పిందన్నారు. కేంద్ర మంత్రి CR పాటిల్‌తో భేటీ అనంతరం ఆయన మాట్లాడారు. ‘పోలవరం-బనకచర్లను వ్యతిరేకించాం. పేరు మార్చి AP అనుమతులకు యత్నిస్తోంది. దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేశాం. ప్రాణహిత-చేవెళ్ల, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులకు నిధులు కోరాం’ అని మంత్రి వివరించారు.
News November 18, 2025
వాట్సాప్ ఛానెల్ ద్వారా ‘జైషే’ ఉగ్ర ప్రచారం

ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ డిజిటల్ నెట్వర్క్ ద్వారా యువతను టెర్రరిజమ్ వైపు మళ్లిస్తోంది. ఈ సంస్థకు సంబంధించిన వాట్సాప్ ఛానెల్‌ను నిఘా సంస్థలు గుర్తించాయి. ఈ ఛానెల్‌కు 13వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. దీని ద్వారా వేలాది మందిని ఉగ్రమూకలుగా JeM మారుస్తోంది. కాగా ఢిల్లీ పేలుళ్ల కేసులో అరెస్టు చేసిన డానిష్‌ను పోలీసులు పటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచారు. అతడిని 10 రోజుల పాటు ఎన్ఐఏ కస్టడీకి అప్పగించింది.
News November 18, 2025
24 ఆసుపత్రుల్లో క్రిటికల్ కేర్ బ్లాక్‌లు: సత్యకుమార్ యాదవ్

AP: అత్యవసర వైద్య సేవల కోసం 24 ఆసుపత్రుల్లో క్రిటికల్ కేర్ బ్లాక్(CCB)లు అందుబాటులోకి రానున్నాయి. PMABHIM కింద ₹600 కోట్లతో వీటిని ఏర్పాటుచేస్తున్నారు. వీటి పురోగతిపై మంత్రి సత్యకుమార్ యాదవ్ సమీక్షించారు. వీటిలో 13 వచ్చే నెలాఖరుకు, మిగతావి 2026 ఆగస్టు నాటికి పూర్తిచేయాలని ఆదేశించారు. కోవిడ్‌లో అత్యవసర వైద్యానికి ఇబ్బంది అయ్యింది. అటువంటివి మళ్లీ రాకుండా కేంద్రం దేశంలో 621 CCBలను నెలకొల్పుతోంది.


