News July 13, 2024
7సార్లు కాటు.. పాములు పగబడతాయా?(2/2)
పాము పగపై శాస్త్రీయంగా అధ్యయనాలేవీ జరగలేదు. నిజంగా పగలాంటిది ఉంటే సర్పాలు విరివిగా ఉండే భారత్లో ఇప్పటికే నిరూపణ అయి ఉండేదంటున్నారు జంతునిపుణులు. బహుశా బాధితుడిని తొలి పాము కాటేసినప్పుడు దాని తాలూకు ఆనవాలు ఏదైనా అతడిపై ఉండిపోయిందా..? దాన్ని పసిగట్టిన ఇతర పాములు అతడిని వెంబడిస్తున్నాయా? ఈ దిశగానూ ఆలోచించాలంటున్నారు నిపుణులు. మరి ‘పాముపగ’పై మీకు తెలిసిన ఘటనలేమైనా ఉన్నాయా? కామెంట్ చేయండి.
Similar News
News January 20, 2025
దమ్ముంటే ఐదేళ్ల వైసీపీ పాలనపై విచారణ జరిపించండి: షర్మిల
AP: గత 5ఏళ్ల పాలన ఓ విపత్తు అని అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఏపీసీసీ చీఫ్ షర్మిల స్పందించారు. ‘ఆ ఐదేళ్లు కేంద్రంలో ఉంది మీరే కదా? భారీ స్థాయిలో అవినీతి జరిగితే ఎందుకు బయటపెట్టలేదు? రాజధాని లేకుండా పాలన సాగుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు? జగన్ మీరు ఆడించినట్లు ఆడినందుకా? మీకు దమ్ముంటే గత 5 ఏళ్ల వైసీపీ పాలనపై వెంటనే కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించండి’ అని అమిత్ షాను డిమాండ్ చేశారు.
News January 20, 2025
కాలేజీకి వెళ్లమన్నారని చనిపోయింది
TG: మెదక్ జిల్లా పొడ్చన్పల్లిలో విషాదం చోటు చేసుకుంది. కాలేజీకి వెళ్లమన్నందుకు ఇంటర్ విద్యార్థిని సింధూజ(19) ఆత్మహత్య చేసుకుంది. నెల రోజులుగా ఆమె ఇంట్లోనే ఉంటోంది. దీంతో నిన్న పేరెంట్స్ కళాశాలకు వెళ్లాలని ఒత్తిడి చేశారు. మనస్తాపానికి గురైన సింధూజ ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరి వేసుకుని బలవన్మరణం చెందింది.
News January 20, 2025
TODAY GOLD RATES
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.120 పెరిగి రూ.81,230కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.150 పెరిగి రూ.74,500గా నమోదైంది. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కేజీ సిల్వర్ రేట్ రూ.1,04,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని మిగతా ప్రాంతాల్లోనూ దాదాపు ఇవే ధరలున్నాయి.