News November 25, 2024
విజయానికి 7 వికెట్లే..
BGTలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. రెండో ఇన్నింగ్సులో జైస్వాల్, కోహ్లీ సెంచరీలు చేయడంతో అతిథ్య జట్టు ముందు 534 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. భారీ లక్ష్య ఛేదనలో AUS 12 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. కొండంత టార్గెట్ను ఛేదించడం ఆస్ట్రేలియాకు సవాల్గా మారింది. మరోవైపు మిగతా 7 వికెట్లు కూల్చి భారత్కు తొలి విజయాన్ని అందించాలని బుమ్రా సేన ఉవ్విళ్లూరుతోంది.
Similar News
News November 25, 2024
పోటీపడి జలవిద్యుదుత్పత్తి.. అడుగంటుతున్న శ్రీశైలం జలాలు
శ్రీశైలం జలాశయం నుంచి AP, TG పోటీ పడి జలవిద్యుదుత్పత్తి చేస్తున్నాయి. రోజూ 40వేల క్యూసెక్కులు వాడుకుంటుండటంతో నీటినిల్వలు వేగంగా పడిపోతున్నాయి. గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 215TMCలు కాగా ప్రస్తుతం 149TMCలే మిగిలిఉన్నాయి. వచ్చే వర్షాకాలం వరకు సాగు, తాగు అవసరాల కోసం నీటిని సంరక్షించాలని కృష్ణా బోర్డు లేఖ రాసినా AP, TG పట్టించుకోవట్లేదు. ఇలాగే కొనసాగితే నీటి కటకట తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
News November 25, 2024
నేడు RGVని విచారించనున్న ప్రకాశం పోలీసులు
డైరెక్టర్ RGVని ఇవాళ ప్రకాశం జిల్లా పోలీసులు విచారించనున్నారు. వ్యూహం సినిమా ప్రమోషన్లలో భాగంగా చంద్రబాబు, పవన్ను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదైంది. వారం కిందటే విచారణకు రావాలని పోలీసులు నోటీసులివ్వగా, తనకు సమయం కావాలని వాట్సాప్లో ఆర్జీవీ మెసేజ్ పంపారు. ఆ గడువు అయిపోగా, నేడు ఆయన్ను విచారించడానికి ఒంగోలు PSలో ఏర్పాట్లు చేశారు.
News November 25, 2024
IPL: ఈరోజు వేలానికి వచ్చేది వీరే..
డుప్లెసిస్, ఫిలిప్స్, విలియమ్సన్, సామ్ కరన్, మిచెల్, కృనాల్ పాండ్య, సుందర్, శార్దుల్ ఠాకూర్, ఇంగ్లిస్, దీపక్ చాహర్, ఫెర్గ్యూసన్, భువనేశ్వర్ కుమార్, ముకేశ్ కుమార్, ముజీర్ రెహ్మాన్, మోయిన్ అలీ, టిమ్ డేవిడ్, విల్ జాక్స్, ముస్తాఫిజుర్, నవీన్ ఉల్ హక్, ఉమేశ్ యాదవ్, స్టీవ్ స్మిత్, లూయిస్, శాంట్నర్, హెన్రీ, అల్జరీ జోసెఫ్, హోల్డర్ etc. పూర్తి లిస్ట్ కోసం <