News March 17, 2025
ఫేక్ పాస్పోర్టు, వీసాతో ప్రవేశిస్తే 7 ఏళ్లు జైలు, ఫైన్!

సరికొత్త ఇమ్మిగ్రేషన్ బిల్లును పార్లమెంటు ఆమోదిస్తే దేశంలోకి అక్రమంగా ప్రవేశించేవారికి చుక్కలు కనిపించడం ఖాయమే. ఫేక్ పాస్పోర్టు లేదా వీసాతో దేశంలోకి ప్రవేశించేవారు, ఉండేవారు, విడిచివెళ్లే వారు గరిష్ఠంగా ఏడేళ్లు జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అలాగే రూ.10 లక్షల వరకు జరిమానా చెల్లించాల్సి వస్తుంది. ఎయిర్లైన్స్, షిప్స్ ముందస్తుగా ప్రయాణికులు, స్టాఫ్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.
Similar News
News November 1, 2025
బిహార్లో ఎవరు గెలిచినా స్వల్ప మెజారిటీయే: JVC సర్వే

బిహార్లో పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ NDA, MGBల మధ్య వార్ నువ్వానేనా అన్నట్లు నడుస్తోంది. ఈ తరుణంలో ఏది గెలిచినా స్వల్ప మెజారిటీతోనే గట్టెక్కుతుందని JVC సర్వే చెబుతోంది. 243 సీట్లలో NDAకు 120-140 మధ్య సీట్లు రావచ్చంది. MGBకి 93-112 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. అయితే CM అభ్యర్థిగా తేజస్వీకి 33%, నితీశ్కు 29% మంది మద్దతు తెలిపారు. ప్రశాంత్ కిశోర్, చిరాగ్ పాశ్వాన్ 3వ ప్లేస్లో ఉన్నారు.
News November 1, 2025
ఎకరాకు రూ.25వేల పరిహారం ఇవ్వాలి: షర్మిల

AP: మొంథా తుఫాను రైతుల పాలిట మహావిపత్తు అని కాంగ్రెస్ స్టేట్ చీఫ్ షర్మిల అన్నారు. తుఫాన్ ప్రభావంతో రూ.20వేల కోట్ల నష్టం వాటిల్లితే సీఎం చంద్రబాబు తక్కువ చేసి చూపిస్తున్నారని ఆరోపించారు. పరిహారం ఇవ్వలేక ఇలా చేస్తున్నారని విమర్శించారు. బాధిత రైతులకు ఎకరాకు రూ.25వేల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విపత్తును కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించి, ఉచిత పంట బీమా పథకాన్ని తిరిగి అమలు చేయాలన్నారు.
News November 1, 2025
107 ఉద్యోగాలకు నోటిఫికేషన్

AP: విజయవాడలో ఉన్న ఆయుష్ విభాగంలో 107 ఉద్యోగాల భర్తీకి APMSRB నోటిఫికేషన్ విడుదల చేసింది. ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ రిక్రూట్మెంట్ జరగనుంది. పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, ఎంకామ్, MBA, CA, ICWA, MD, BAMS, BHMS, BUMS, BNYS పాసవ్వడంతోపాటు APMCలో రిజిస్ట్రేషన్ ఉండాలి. అభ్యర్థులు ఇవాళ్టి నుంచి ఈ నెల 15 వరకు అప్లై చేసుకోవచ్చు.
వెబ్సైట్: https://apmsrb.ap.gov.in/msrb/


