News February 28, 2025
70 సైకిళ్లు సిద్ధం.. తీసుకెళ్లేందుకు మీరు సిద్ధమా!

జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు మంచి ఫలితాలు సాధించిన వారికి 70 సైకిళ్లు ఇచ్చేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. పదో తరగతి తుది ఫలితాల్లో విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించి సైకిళ్లను పొందాలన్నారు. 192 ప్రభుత్వ విద్యాసంస్థల్లో పదో తరగతి చదువుతున్న 6074 మంది విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో చదవాలన్నారు.
Similar News
News March 1, 2025
వరంగల్ కమిషనర్ WARNING

నిర్దిష్ట లక్ష్యాన్ని చేరుకోకపోతే చర్యలు తప్పవని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను హెచ్చరించారు. శుక్రవారం హెడ్ ఆఫీస్లో రెవెన్యూ వసూళ్ల పురోగతిపై ఆర్ఐలతో కమిషనర్ సమీక్షించారు. ఇప్పటివరకు జరిపిన వసూళ్ల పురోగతిని ఆర్ఐల వారీగా రివ్యూ నిర్వహించి, ఇటీవల సీడీఎంఏ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రతి వార్డ్ ఆఫీసర్ నుంచి అదనపు కమిషనర్ వరకు సూచించిన లక్ష్యాలను చేరుకోవాలన్నారు.
News March 1, 2025
VZM: ప్రేమ వ్యవహారమే మృతికి కారణం..!

తోటపాలెం సమీపంలో బొండపల్లి జనార్ధన్ అనే యువకుడు ఐదంతస్తుల భవనంపై నుంచి దూకి శుక్రవారం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సీఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. జనార్ధన్ డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉంటున్నాడని, డిగ్రీ చదివిన సమయంలో ప్రేమ విఫలమైన కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుడి తండ్రి కుమార్ తెలిపారన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
News March 1, 2025
సరస్వతి పుష్కరాల ఏర్పాట్లు వేగవంతం చేయాలి: భూపాలపల్లి కలెక్టర్

సరస్వతి పుష్కరాల ఏర్పాట్లు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సరస్వతి పుష్కరాల సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఇరిగేషన్ 4, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం 7, మిషన్ భగీరథ 15, దేవస్థానం ఇంజినీరింగ్ విభాగం 28, విద్యుత్ 11, మొత్తం 65 పనులు పూర్తి చేయాల్సి ఉన్నట్లు తెలిపారు.