News May 4, 2024

70 ఏళ్ల క్రితమే విశాఖ రాజధాని ప్రతిపాదన

image

70 ఏళ్ల క్రితమే విశాఖ రాజధాని కావాలని గొంతెత్తిన సాలూరు మొదటి MLA కూనిశెట్టి వెంకటనారాయణ దొర. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో గెలిచిన కూనిశెట్టి 1952లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి భాషాప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో ఆనాడే ఆయన ఉత్తరాంధ్ర అభివృద్ధి జరగాలంటే విశాఖ రాజధాని కావాలని గొంతెత్తారు. ప్రతిపాదనపై ఓటింగ్‌ జరిగితే ఒకే ఒక్క ఓటుతో తీర్మానం వీగిపోయింది.

Similar News

News November 29, 2024

విజయనగరం జిల్లాలో విషాదం

image

ఎస్.కోట మండలంలో 2 వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మహిళలు మృతిచెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఎస్.కోటకు చెందిన విశాలక్ష్మి (86) బుధవారం వంట చేస్తుండగా చీరకు నిప్పు అంటుకుంది. తీవ్రంగా గాయపడిన ఆమెను విశాఖ తరలించగా అక్కడ చికిత్సపొందుతూ గురువారం మృతిచెందారు. అదేవిధంగా వెంకటరమణ పేట గ్రామానికి చెందిన సన్నమ్మ మెట్ల నుంచి జారిపడగా మెరుగైన చికిత్స కోసం KGHకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతిచెందారు.

News November 29, 2024

గంజాయి రవాణాపై 289 కేసులు: DIG

image

గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు ఎటువంటి సమాచారం ఉన్నా 1972 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలని డీఐజీ గోపీనాథ్ జెట్టీ విజ్ఞప్తి చేశారు. చీపురుపల్లి డీఎస్పీ కార్యాలయాన్ని గురువారం సందర్శించారు. ఇప్పటివరకు గంజాయి రవాణాపై 289 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. గంజాయి అక్రమ రవాణాకు డైనమిక్ చెక్ పోస్టులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 29 స్పెషల్ టీములను గంజాయి రవాణా అరికట్టేందుకు నియమించాన్నారు.

News November 28, 2024

గంజాయి రవాణాపై 289 కేసులు: DIG

image

గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు ఎటువంటి సమాచారం ఉన్న 1972 టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయాలని డీఐజీ గోపీనాథ్ జెట్టీ విజ్ఞప్తి చేశారు. చీపురుపల్లి డీఎస్పీ కార్యాలయాన్ని గురువారం సందర్శించారు. ఇప్పటివరకు గంజాయి రవాణాపై 289 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. గంజాయి అక్రమ రవాణాకు డైనమిక్ చెక్ పోస్టులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 29 స్పెషల్ టీములను గంజాయి రవాణా అరికట్టేందుకు నియమించాన్నారు.