News January 2, 2026

70 ఏళ్ల వయసులో 700KM సైకిల్ యాత్ర.. మోదీ ప్రశంసలు!

image

70 ఏళ్ల వయసులో 700KMకు పైగా సైకిల్ యాత్ర నిర్వహించిన BJP MLA సురేశ్ కుమార్‌ను PM మోదీ ప్రశంసించారు. బెంగళూరు నుంచి కన్యాకుమారి వరకు 5 రోజులు ఆయన సైకిల్‌పై వెళ్లారు. ‘సురేశ్ యాత్ర స్ఫూర్తిదాయకం. అనారోగ్య సమస్యను అధిగమించి ఈ ఘనత సాధించడం ఆయన ధైర్యాన్ని, పట్టుదలను తెలియజేస్తోంది. ఫిట్‌నెస్‌పై ముఖ్యమైన సందేశాన్ని ఇస్తోంది’ అని ట్వీట్ చేశారు. ఆయనకు ఫోన్ చేసి అభినందించినట్లు తెలిపారు.

Similar News

News February 17, 2026

అణు చర్చల వేళ హార్ముజ్‌లో ఇరాన్ యుద్ధ విన్యాసాలు

image

అణు ఒప్పందంపై USతో చర్చలు ప్రారంభమైన వేళ ఇరాన్ తన సైనిక బలాన్ని ప్రదర్శించింది. హార్ముజ్ జలసంధి లక్ష్యంగా ‘రెవల్యూషనరీ గార్డ్’ లైవ్-ఫైర్ విన్యాసాలు చేపట్టింది. తీర ప్రాంతం నుంచి ప్రయోగించిన మిస్సైల్స్ జలసంధిలోని లక్ష్యాలను తాకినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ప్రపంచ చమురు సరఫరాలో 20% వాటా ఉండే ఈ జలమార్గంలో విన్యాసాలు చేయడం ద్వారా ఇరాన్ ప్రపంచ దేశాలకు బలమైన సంకేతాలు పంపింది.

News February 17, 2026

BREAKING: ఐబొమ్మ రవికి బెయిల్

image

TG: ఐబొమ్మ నిర్వాహకుడు రవికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతి రోజూ ఉ.11 గంటలకు సీపీఎస్ పోలీసుల ఎదుట హాజరుకావాలని స్పష్టం చేసింది. దేశం విడిచి వెళ్లొద్దని, పాస్ పోర్టును కోర్టులో సరెండర్ చేయాలని ఆదేశించింది. కోర్టు అనుమతితోనే ఇంటర్నెట్ వాడాలని తేల్చిచెప్పింది. సినిమాల పైరసీ కేసులో గతేడాది నవంబర్‌ 16న రవి అరెస్టయిన విషయం తెలిసిందే.

News February 17, 2026

100 ఎకరాల్లో జినోమ్ వ్యాలీ ఫేజ్-4: శ్రీధర్ బాబు

image

TG: జినోమ్ వ్యాలీని విస్తరిస్తూ ఫేజ్-4ను 100 ఎకరాల్లో అభివృద్ధి చేయనున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ‘లైఫ్ సైన్సెస్ రంగంలో 2035 నాటికి $25B పెట్టుబడుల లక్ష్యంగా ప్లాన్ రూపొందించాం. Trident AI కంపెనీ (US) ₹300CR, Rx Propellant ₹1000CR పెట్టుబడి పెడుతున్నాయి. Opella (France) కంపెనీ ముందుకొచ్చింది. AI ఆధారిత డ్రగ్స్ డిస్కవరీలో యువతకు శిక్షణ ఇప్పిస్తాం’ అని బయో ఆసియా-2026 సదస్సులో తెలిపారు.