News January 2, 2026
70 ఏళ్ల వయసులో 700KM సైకిల్ యాత్ర.. మోదీ ప్రశంసలు!

70 ఏళ్ల వయసులో 700KMకు పైగా సైకిల్ యాత్ర నిర్వహించిన BJP MLA సురేశ్ కుమార్‌ను PM మోదీ ప్రశంసించారు. బెంగళూరు నుంచి కన్యాకుమారి వరకు 5 రోజులు ఆయన సైకిల్‌పై వెళ్లారు. ‘సురేశ్ యాత్ర స్ఫూర్తిదాయకం. అనారోగ్య సమస్యను అధిగమించి ఈ ఘనత సాధించడం ఆయన ధైర్యాన్ని, పట్టుదలను తెలియజేస్తోంది. ఫిట్‌నెస్‌పై ముఖ్యమైన సందేశాన్ని ఇస్తోంది’ అని ట్వీట్ చేశారు. ఆయనకు ఫోన్ చేసి అభినందించినట్లు తెలిపారు.
Similar News
News January 2, 2026
మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణకు సూచనలు (1/2)

మొక్కజొన్న విత్తిన వెంటనే ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలను అమర్చి కత్తెర పురుగు ఉనికిని గమనించాలి. మొక్కలపై వాటి గుడ్లను గమనిస్తే వేపమందును పిచికారీ చేయాలి. లేత మొక్కజొన్న పంటల్లో 30 రోజుల వరకు ఎకరాకు 15 పక్షి స్థావరాలను, 15 లింగాకర్షక బుట్టలను పైరులో ఏర్పాటు చేసుకోవాలి. ఎకరాకు 9 కిలోల పొడి ఇసుక, కిలో సున్నాన్ని కలిపి మొక్కజొన్న సుడులలో వేస్తే ఇసుక రాపిడికి కత్తెర పురుగు లార్వాలు చనిపోతాయి.
News January 2, 2026
మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణకు సూచనలు(2/2)

మొక్కజొన్న పంట 31 నుంచి 60 రోజుల లోపు ఉండి పైరులో 6-10% మొక్కలను కత్తెర పురుగు రెండో దశ లార్వా ఆశించినట్లు గమనిస్తే రసాయన మందులతో సస్యరక్షణ చేపట్టాలి. లీటరు నీటికి 0.4 గ్రాముల ఇమామెక్టిన్ బెంజోయేట్ 5% SG లేదా స్పైనోశాడ్ 45% SC 0.3ml కలిపి.. చేతి పంపుతో మొక్క సుడులలో పడే విధంగా పిచికారీ చేసి కత్తెర పురుగును నియంత్రించవచ్చు. ఈ రసాయనాల పిచికారీ విషయంలో వ్యవసాయ నిపుణుల సలహా తప్పక తీసుకోండి.
News January 2, 2026
నేటి నుంచి కొత్త పాసు పుస్తకాల పంపిణీ

AP: నేటి నుంచి ఈ నెల 9 వరకు గ్రామసభల్లో కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో ప్రభుత్వ రాజముద్రతో రూపొందించిన పాస్ బుక్‌లను ప్రజాప్రతినిధులు అందించనున్నారు. వాటిలో ఏవైనా తప్పులుంటే యజమానులు ఆందోళన చెందవద్దని అధికారులు తెలిపారు. పాసు పుస్తకాన్ని స్వర్ణ వార్డు, గ్రామ రెవెన్యూ సిబ్బందికి ఇస్తే తప్పులు సవరించి కొత్త పాస్ పుస్తకాలు అందిస్తారని పేర్కొన్నారు.


