News September 4, 2025

NCC, డిగ్రీ అర్హతతో 70 లెఫ్టినెంట్ పోస్టులు

image

NCC సర్టిఫికెట్ ఉన్న పురుష అభ్యర్థులు స్పెషల్ ఎంట్రీ కింద 70 లెఫ్టినెంట్ ఉద్యోగాలకు ఈ నెల 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం 50 మార్కులతో డిగ్రీ పాసైన వారు అర్హులు. 19-25ఏళ్లలోపు వయసుండాలి. NCC, డిగ్రీ మార్కులు, ఫిజికల్ టెస్టులు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. శిక్షణ సమయంలో నెలకు ₹56,100 స్టైఫండ్, విధుల్లో చేరిన తర్వాత ₹లక్షకు పైగా జీతం పొందొచ్చు.
వెబ్‌సైట్: <>https://joinindianarmy.nic.in/<<>>

Similar News

News September 5, 2025

ధరల తగ్గింపు.. ఓల్డ్ స్టాక్ పరిస్థితేంటి?

image

GST సంస్కరణలతో దాదాపు 400 రకాల గూడ్స్&సర్వీసెస్ రేట్లు ఈనెల 22 నుంచి తగ్గనున్నాయి. మరి ఇప్పటికే మార్కెట్లో ఉన్న వాటి రేట్లు తగ్గిస్తారా లేదా అన్న సందేహం నెలకొంది. అయితే ఈ సమస్యను కంపెనీలు, డిస్ట్రిబ్యూటర్లే ఎదుర్కొంటారని తెలుస్తోంది. GST తగ్గింపు ప్రయోజనాలు వినియోగదారులకు చేరాలన్న కేంద్రం ఆదేశాలతో ధరల సర్దుబాటు ప్రక్రియ స్టార్ట్ చేసినట్లు సమాచారం. కొత్త రేట్ స్టిక్కర్‌తో విక్రయించే అవకాశముంది.

News September 5, 2025

భార్యకు అధిక ఆదాయముంటే భరణం అక్కర్లేదు: మద్రాస్ HC

image

చెన్నైకి చెందిన వైద్య దంపతుల కేసులో మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. భార్యకు ఆదాయం అధికంగా ఉంటే భర్త భరణం ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పింది. భార్యకు నెలకు రూ.30 వేలు ఇవ్వాలని విడాకుల సమయంలో ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టేసింది. ఆమెకు అధికంగా ఆదాయం, ఆస్తులు ఉన్నాయని, భరణం ఇవ్వక్కర్లేదని స్పష్టం చేసింది. కుమారుడి చదువుకు డబ్బు ఇచ్చే విషయంలో కోర్టు జోక్యం చేసుకోదని పేర్కొంది.

News September 5, 2025

అనుష్క ‘ఘాటీ’ మూవీ పబ్లిక్ టాక్

image

అనుష్క ప్రధానపాత్రలో క్రిష్ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ఘాటీ’ ఇవాళ థియేటర్లలో రిలీజైంది. US, UK ప్రీమియర్స్ చూసిన వారు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. అనుష్క పర్ఫార్మెన్స్ అదిరిపోయిందని పోస్టులు చేస్తున్నారు. ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకుంటాయని చెబుతున్నారు. ఊహించే కథ, బోర్ కొట్టే సీన్స్ ఇబ్బంది పెడతాయని అంటున్నారు.
*మరికొన్ని గంటల్లో Way2News రివ్యూ.