News January 27, 2025
7,106 సమస్యలను పరిష్కరించాం: నంద్యాలకలెక్టర్

నంద్యాల జిల్లాలో ప్రజల సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా 2024 జూన్ మాసం నుంచి ఇప్పటివరకు ప్రజల నుంచి వచ్చిన 8,216 అర్జీలలో 7,106 సమస్యలను పరిష్కరించామని కలెక్టర్ రాజకుమారి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 489 గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి 3,633 విజ్ఞప్తులను రైతుల నుంచి స్వీకరించి ఇప్పటివరకు 1,483 అర్జీలను పరిష్కరించామని కలెక్టర్ వివరించారు.
Similar News
News December 16, 2025
NZB: మూడో విడత.. పోలింగ్ జరిగే మండలాలివే

బుధవారం నిజామాబాద్ జిల్లాలో జరిగే తుది విడత పోలింగ్కు 1100 మందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. మూడో విడత పోలింగ్ జిల్లాలోని ఆర్మూర్ డివిజన్లోని కమ్మర్పల్లి, మోర్తాడ్, భీమ్గల్, వేల్పూర్, బాల్కొండ, ముప్కాల్, మెండోరా, ఏర్గట్ల, ఆర్మూర్, ఆలూర్, నందిపేట్, డొంకేశ్వర్ మండలాల పరిధిలోని గ్రామాల్లో జరగనుంది.
News December 16, 2025
GNT: మృతదేహాల తరలింపులోనూ వసూళ్ల దందా.!

ఎంతో ఘన చరిత్ర ఉన్న గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మహాప్రస్థానం వాహనాల డ్రైవర్లు వసూళ్ల దందాకు పాల్పడుతున్నట్లు బాధితులు వాపోతున్నారు. మృతదేహాన్ని ఉచితంగా గమ్యస్థానానికి చేర్చాల్సిన మహాప్రస్థానం వాహన డ్రైవర్లు దూరాన్ని బట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రాణం కోల్పోయిన బాధలో ఉన్న కుటుంబాలను కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని బాధితులు వాపోతున్నారు.
News December 16, 2025
బీట్ రూట్ సాగులో కలుపు నివారణ ఎలా?

బీట్ రూట్లో కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించాలి. విత్తిన 24-48 గంటల్లోపు ఎకరాకు తేలిక నేలల్లో 200 లీటర్ల నీటిలో పెండిమిథాలిన్ 1.25 లీటర్లు, అదే బరువు నేలల్లో అయితే 200 లీటర్ల నీటిలో అలాక్లోర్ 1.25L కలిపి పిచికారీ చేయాలి. విత్తిన 15 రోజులకు 200 లీటర్ల నీటిలో మెట్రిబుజిన్ 300 గ్రా. కలిపి పిచికారీ చేయాలి. గింజ మొలకెత్తిన 20-25 రోజుల తర్వాత కలుపు తీసి మన్ను ఎగదోస్తే గడ్డ బాగా ఊరుతుంది.


