News September 24, 2024
రాష్ట్రవ్యాప్తంగా 7,139 ధాన్యం కొనుగోలు కేంద్రాలు: మంత్రి ఉత్తమ్

TG: ఖరీఫ్ సీజన్‌లో రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 7,139 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. సన్నాలు, దొడ్డు వడ్లకు వేర్వేరు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో 146.28 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రానున్నట్లు అంచనా వేశామన్నారు. ఈ ఖరీఫ్ నుంచి సన్నాలకు రూ.500 బోనస్ ఇస్తామని వెల్లడించారు.
Similar News
News December 1, 2025
శివుడు పుర్రెల దండ ఎందుకు ధరిస్తాడు?

పరమ శివుడు పుర్రెల దండ, చితాభస్మం ధరించి శ్మశానంలో తిరుగుతుంటాడు. అందుకు కారణం శిష్టరక్షణ. అసురులు ధర్మబద్ధంగా వరాలు పొంది దేవతలను హింసించేవారు. వారిని మోహానికి గురి చేయడానికి విష్ణుమూర్తి ఆజ్ఞ మేరకు శివుడు ఈ వేషం ధరించి, పాషండ మతాన్ని ఉపదేశించాడు. దీంతో వేద నింద, దైవ నింద చేసిన రాక్షసుల తేజస్సు క్షీణించింది. అలాగే వారి నుంచి దేవతలకు ఉపశమనం లభించింది. ఇది ధర్మ రక్షణకై హరిహరులు చేసిన లీల.
News December 1, 2025
భయపెడుతున్న పురుగు.. రాష్ట్రంలో పెరుగుతున్న కేసులు

AP: రాష్ట్రంలో <<18409601>>స్క్రబ్ టైఫస్<<>> వ్యాధి కేసులు కలకలం రేపుతున్నాయి. చిత్తూరు, కాకినాడ, విశాఖలో 500కు పైగా కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ లక్షణాలతో విజయనగరంలో మహిళ మరణించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జ్వరం, వాంతులు, అలసట, దగ్గు లాంటి లక్షణాలు ఉంటాయని ఫీవర్ తగ్గకపోతే పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఇది అంటు వ్యాధి కాదని వైద్యులు తెలిపారు.
News December 1, 2025
1383 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

దేశవ్యాప్తంగా ఉన్న AIIMS హాస్పిటల్స్, కేంద్ర ప్రభుత్వ ఇన్‌స్టిట్యూట్స్‌లో 1383 గ్రూప్ B, గ్రూప్ C పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, బీటెక్, BE, MBA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. కామన్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామినేషన్-4(CRE-4)2025 ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్. https://aiimsexams.ac.in/


