News December 10, 2024

ఈ ఏడాదిలో విమానాలకు 719 బాంబు బెదిరింపు కాల్స్

image

విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కు గత ఐదేళ్లలో 809 ఫేక్ బాంబ్ థ్రెట్స్ వచ్చినట్లు పార్లమెంట్‌లో కేంద్రం వెల్లడించింది. ఇందులో 719 కేసులు 2024లోనే నమోదైనట్లు వెల్లడించింది. 2020లో నాలుగు, 2021లో రెండు, 2022లో 13, 2023లో 71 బాంబు బెదిరింపులు వచ్చాయి. అయితే, చాలా సార్లు కావాలనే ఇలాంటి ఫేక్ కాల్స్, మెసేజ్‌లు చేసినట్లు నిందితులు ఒప్పుకోవడం గమనార్హం.

Similar News

News December 4, 2025

కొత్త ఏడాదిలోనే మార్కాపురం జిల్లా..!

image

నూతన సంవత్సరం వస్తూ వస్తూ.. మార్కాపురం డివిజన్ ప్రజల కలను నెరవేరుస్తోంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు జిల్లా ప్రకటనకు పచ్చజెండా ఊపారు. అయితే ఈనెల 30 వరకు అభ్యంతరాలు, సూచనలు స్వీకరించేందుకు గడువు ఉంది. దీనిని బట్టి 2026 రావడంతోనే, కొత్త జిల్లా అధికారిక ప్రకటన రానుంది. 2026 జనవరి 1 రోజే అధికారిక ఉత్తర్వులు రావచ్చని ప్రచారం సాగుతోంది. మొత్తం మీద కొత్త ఏడాది కొత్త కబుర్లు తీసుకురానుందని ప్రజలు అంటున్నారు.

News December 4, 2025

SGB బొనాంజా.. గ్రాముకు రూ.9,859 లాభం

image

సావరిన్ గోల్డ్ బాండ్స్(SGB) మదుపర్లకు భారీ లాభాలను అందిస్తున్నాయి. 2017 డిసెంబర్ 4న విడుదల చేసిన సిరీస్‌-X బాండ్లకు అప్పట్లో గ్రాము ₹2,961గా RBI నిర్ణయించింది. తాజాగా ఆ బాండ్లు మెచ్యూరిటీకి వచ్చాయి. ప్రస్తుతం వాటి ధరను ₹12,820గా RBI నిర్ణయించింది. అంటే ఒక్కో గ్రాముపై ₹9,859 లాభం(333%) వచ్చింది. దీనికి ఏటా చెల్లించే 2.5% వడ్డీ అదనం. ఇటీవల సిరీస్‌-VI బాండ్లకు ₹9,121 లాభం వచ్చిన విషయం తెలిసిందే.

News December 4, 2025

పుతిన్ పర్యటనతో భారత్‌కు లాభమేంటి?

image

* ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్ మిస్సైళ్లు, డ్రోన్లను కూల్చడానికి S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ బాగా ఉపయోగపడ్డాయి. పుతిన్ పర్యటనలో మరిన్ని S-400లతో పాటు S-500 కొనుగోలుకు ఆమోదం లభించనుంది.
* రఫేల్, F-21, F/A-18, యూరో ఫైటర్ టైఫూన్లకు పోటీనిచ్చే Su-57 ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్స్ కొనుగోలుపైనా చర్చలు జరుగుతాయి. ఇవి రఫేల్ కంటే తక్కువ ధరకే లభించడం విశేషం.