News May 10, 2024

72ఏళ్లు మెదక్‌లో ముగ్గురే మహిళా ఎంపీలు

image

అన్నిరంగాల్లో ముందడుగు వేస్తున్న మహిళలు చట్టసభల్లో అతంతగానే రాణిస్తున్నారు. మెదక్ లోక్‌సభ ఏర్పడి 72ఏళ్లు అవుతున్నా ఇక్కడి నుంచి కేవలం ముగ్గురు మహిళలే MPలుగా ఎన్నికయ్యారు. 1967 ఎన్నికల్లో సంగం లక్ష్మీబాయి(కాంగ్రెస్), 1980లో ఇందిరాగాంధీ, 2009లో విజయశాంతి(BRS) గెలిచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. జహీరాబాద్‌ నుంచి ఇప్పటివరకు ఒక్కరూ లేరు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో మహిళా ఎమ్మెల్యే సునీతారెడ్డి ఒక్కరే.

Similar News

News November 26, 2025

మెదక్: రేపు స్థానిక సంస్థల పరిశీలకురాలు రాక

image

మెదక్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు సాధారణ పరిశీలకురాలు భారతి లక్పతి నాయక్ రేపు జిల్లాకు రానున్నారని కలెక్టర్ రాహుల్ రాజ్ వెల్లడించారు. ఆమె జిల్లా ఎన్నికల ప్రక్రియ, నిర్వహణ, అధికారుల సంసిద్ధతను సమీక్షించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పారదర్శకత, క్రమశిక్షణ కోసం అవసరమైన మార్గదర్శకాలు పరిశీలకులు ఇచ్చే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు.

మెదక్ కలెక్టరేట్‌లో మీడియా సెంటర్ ప్రారంభం

image

మెదక్ కలెక్టరేట్‌లో మీడియా సెంటర్‌ను డీపీఆర్ఓ రామచంద్రరాజుతో కలిసి జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య ప్రారంభించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో భాగంగా మీడియా సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల పత్రికా ప్రకటనలు, సోషల్ మీడియా ప్రచారంపై మీడియా సెంటర్ ద్వారా నిఘా పెట్టనున్నట్లు పేర్కొన్నారు.