News May 10, 2024
72ఏళ్లు మెదక్‌లో ముగ్గురే మహిళా ఎంపీలు

అన్నిరంగాల్లో ముందడుగు వేస్తున్న మహిళలు చట్టసభల్లో అతంతగానే రాణిస్తున్నారు. మెదక్ లోక్‌సభ ఏర్పడి 72ఏళ్లు అవుతున్నా ఇక్కడి నుంచి కేవలం ముగ్గురు మహిళలే MPలుగా ఎన్నికయ్యారు. 1967 ఎన్నికల్లో సంగం లక్ష్మీబాయి(కాంగ్రెస్), 1980లో ఇందిరాగాంధీ, 2009లో విజయశాంతి(BRS) గెలిచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. జహీరాబాద్ నుంచి ఇప్పటివరకు ఒక్కరూ లేరు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో మహిళా ఎమ్మెల్యే సునీతారెడ్డి ఒక్కరే.
Similar News
News February 17, 2025
మెదక్: కలుసుకున్న 1972 ఇంటర్ మొదటి బ్యాచ్

మెదక్ పట్టణంలో ఇంటర్మీడియట్ మొదటి బ్యాచ్(1972) చదువుకున్న వారంతా ఆదివారం కలుసుకున్నారు. ఇందులో కొందరు చాలా ఉన్నత స్థానంలో ఉన్నారు. సరోజిని దేవి విద్యాసంస్థల ఛైర్మన్ ఆర్. జనార్ధన్ రెడ్డి, రిటైర్డ్ TSPCDL డైరెక్టర్ తౌట శ్రీనివాస్, వివి సిల్క్స్ వనపర్తి వెంకటేశం, అల్లెంకి సుదర్శనం, వెంకటేశం, మేడిశెట్టి కుమార్, STO జగన్నాథం, డా. రామరాజు, క్రిష్ణయ్య తదితరులున్నారు. వారంత ఆప్యాయంగా మాట్లాడుకున్నారు.
News February 17, 2025
ఇంటింటి సర్వేలో పాల్గొనని వారికి అవకాశం

సమగ్ర ఇంటింటి సర్వేలో నమోదు చేసుకోనివారు ప్రజాపాలన కేంద్రాల్లో సమాచారం అందజేయాలని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మెదక్ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సేవా కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
News February 17, 2025
విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి: డీఈవో

విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే విధంగా నూతన ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాధికారి రాధా కిషన్ తెలిపారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. జిల్లాలో 64 మంది నూతన ఉపాధ్యాయులు విధుల్లో చేరనున్నారని, దీంతో పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత తీరనుందని తెలిపారు. నూతన ఉపాధ్యాయుల విధులలో చేరిన రిపోర్టును జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి పంపాలని సూచించారు.