News November 20, 2024

కులగణన సర్వే 72 శాతం పూర్తి

image

TG: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే ఇప్పటివరకూ 72% పూర్తయింది. నిన్నటి వరకు 83,64,331 ఇళ్లలో సర్వే చేసినట్లు అధికారులు వెల్లడించారు. అత్యధికంగా ములుగులో 98.9% ఇళ్లలో సర్వే పూర్తయింది. ఆ తర్వాతి రెండు స్థానాల్లో నల్గొండ (95%), జనగామ (93.3%) ఉన్నాయి. హైదరాబాద్‌లో అత్యల్పంగా 50.3% ఇళ్లలో కులగణన జరిగింది.

Similar News

News January 26, 2026

రాహుల్‌కు మూడో వరుసలో సీటుపై వివాదం

image

ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రొటోకాల్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. పార్లమెంటులో ప్రతిపక్ష నేతలు ఖర్గే, రాహుల్ గాంధీలకు మూడో వరుసలో సీటు కేటాయించడంపై రగడ మొదలైంది. ప్రతిపక్ష నేతకు కేంద్రమంత్రులకు ఇచ్చే గౌరవం ఇవ్వాల్సి ఉన్నప్పటికీ కేంద్రం ఉద్దేశపూర్వకంగానే వారిని అవమానించిందని INC నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఆత్మన్యూనతతో బాధపడుతోందని విమర్శిస్తున్నారు.

News January 26, 2026

హిందీ అనేక మాతృభాషలను మింగేసింది: ఉదయనిధి

image

తమిళనాడుపై హిందీని రుద్దే ప్రయత్నాలను ఒప్పుకునేది లేదని Dy.CM ఉదయనిధి స్పష్టం చేశారు. 1960sలో హిందీ వ్యతిరేక ఆందోళనల్లో అమరులైన వారికి నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘ఉత్తరాదిలో హిందీని ప్రవేశపెట్టడం వల్ల హర్యాన్వీ, భోజ్‌పురి, బిహారీ, ఛత్తీస్‌గఢీ వంటి మాతృభాషలు కనుమరుగయ్యాయి. ప్రాంతీయ గుర్తింపు, సాంస్కృతిక వారసత్వాన్ని హిందీ నాశనం చేస్తుందనడానికి ఇదే నిదర్శనం’ అని పేర్కొన్నారు.

News January 26, 2026

రంజీ ట్రోఫీ.. 568 రన్స్ తేడాతో బిహార్ ఘన విజయం

image

రంజీ ట్రోఫీ ప్లేట్ ఫైనల్‌లో మణిపుర్‌పై బిహార్ 568 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సీజన్‌లో పరుగుల పరంగా ఇదే బిగ్గెస్ట్ విన్. బిహార్ ఆటగాళ్లు పీయూష్ సింగ్ 216*, బిపిన్ 143, సకిబుల్ గని 108 పరుగులతో చెలరేగారు. కాగా ఈ విజయంతో వచ్చే సీజన్‌లో ఎలైట్ గ్రూపునకు బిహార్ అర్హత సాధించింది. రంజీ ట్రోఫీలో జట్లను వాటి ప్రదర్శనల ఆధారంగా ఎలైట్(అగ్రశ్రేణి), ప్లేట్(దిగువ శ్రేణి) గ్రూపులుగా విభజిస్తారు.