News October 10, 2024

APకి రూ.7,211 కోట్లు, TGకి రూ.3,745 కోట్లు

image

OCT నెలకుగాను రాష్ట్రాలకు రావాల్సిన పన్నుల వాటాను కేంద్రం విడుదల చేసింది. అడ్వాన్స్ ఇన్‌స్టాల్‌మెంట్ ₹89,086crతో కలిపి మొత్తం ₹1,78,173crను పంపిణీ చేసింది. అత్యధికంగా UPకి ₹31,962cr, బిహార్‌కు ₹17,921cr, MPకి ₹13,987cr అందించింది. ఇక APకి ₹7,211cr, TGకి ₹3,745cr రిలీజ్ చేసింది. పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని, రాష్ట్రాల మూలధన వ్యయాన్ని వేగవంతం చేయడానికి ఈ సాయాన్ని అందించినట్లు పేర్కొంది.

Similar News

News October 10, 2024

సూపర్ హీరోగా నందమూరి బాలకృష్ణ?

image

నందమూరి బాలకృష్ణ ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించినా సూపర్ పవర్స్ ఉన్న హీరో రోల్ మాత్రం ఇప్పటి వరకూ చేయలేదు. త్వరలోనే ఆ పాత్రను కూడా ఆయన పోషించే ఛాన్స్ కనిపిస్తోంది. రేపే దీనికి సంబంధించిన అనౌన్స్‌మెంట్ వస్తుందని టాలీవుడ్ సర్కిల్స్ చెబుతున్నాయి. దీంతో నందమూరి ఫ్యాన్స్‌లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఆయన తనయుడు మోక్షజ్ఞ ఇలాంటి కథతోనే ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

News October 10, 2024

పాక్ కెప్టెన్ ఇంట్లో తీవ్ర విషాదం

image

పాకిస్థాన్ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ ఫాతిమా సనా ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె తండ్రి ఆకస్మికంగా మరణించారు. దీంతో ఆమె హుటాహుటిన దుబాయ్ నుంచి కరాచీ బయల్దేరి వెళ్లారు. ఆస్ట్రేలియాతో జరగబోయే మ్యాచ్‌కు వైస్ కెప్టెన్ మునీబా అలీ సారథిగా వ్యవహరిస్తారు. కాగా మహిళల టీ20 వరల్డ్ కప్‌లో ఫాతిమా సారథ్యంలో పాక్ ఒక మ్యాచ్ గెలిచి, మరొకటి ఓడింది.

News October 10, 2024

తూర్పుగోదావరిలో డ్రగ్స్ కలకలం.. నలుగురు అరెస్ట్

image

AP: నగరాలకే పరిమితమైన డ్రగ్స్ కల్చర్ పట్టణాలకూ విస్తరిస్తోంది. తాజాగా తూ.గో(D) భూపాలపట్నంలోని ఓ గెస్ట్‌హౌస్‌లో జరిగిన బర్త్‌డే పార్టీలో డ్రగ్స్ కలకలం రేపింది. తాడేపల్లిగూడెంకు చెందిన నలుగురు యువకులు టెలిగ్రామ్‌లో కొకైన్ కొనుగోలు చేశారు. ఢిల్లీ నుంచి కొరియర్ ద్వారా టౌన్‌కు తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. 4గ్రా. కొకైన్, 50గ్రా. గంజాయి, కారును స్వాధీనం చేసుకున్నారు.