News October 25, 2025
7,267 ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పొడిగింపు

ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో 7,267 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులకు దరఖాస్తు గడువును పొడిగించారు. OCT 23తో అప్లై గడువు ముగియగా.. OCT 28 వరకు పొడిగించారు. PGT, TGT, వార్డెన్(M, F), స్టాఫ్ నర్స్(F) తదితర పోస్టులున్నాయి. పోస్టును బట్టి PG, B.Ed, డిగ్రీ, BSc నర్సింగ్, ఇంటర్, టెన్త్ పాసైన వారు అర్హులు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. వెబ్‌సైట్: https://nests.tribal.gov.in
Similar News
News October 25, 2025
జైళ్ల నుంచి ఉగ్ర, హత్య కుట్రలపై కేంద్రం అప్రమత్తం

జైళ్ల నుంచి ఉగ్ర, హత్య కుట్రలు చేస్తున్న టెర్రరిస్టు-గ్యాంగ్‌స్టర్ నెట్వర్క్‌ను విచ్ఛిన్నం చేసేలా ప్రణాళికను రూపొందించాలని అన్ని భద్రతా ఏజెన్సీలకు కేంద్ర హోమ్ శాఖ ఆదేశాలిచ్చింది. ఇటీవల జరిగిన కొన్ని హత్యలపై 53చోట్ల NIA చేసిన సోదాల్లో జైళ్ల నుంచి ఆర్గనైజ్డ్ నెట్వర్కు నడుస్తున్నట్లు తేలడంతో చర్యలు చేపట్టింది. రాష్ట్రాల పోలీసుల సహకారంతో అత్యంత ప్రమాదకారుల్ని గుర్తించి వారిని ఇతర జైళ్లకు తరలించనుంది.
News October 25, 2025
‘యుద్ధం చేస్తాం’.. అఫ్గాన్‌కు పాక్ వార్నింగ్

పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మధ్య ఇస్తాంబుల్‌లో శాంతి చర్చలు ఓ కొలిక్కి రాలేదు. రేపు కూడా ఈ చర్చలు కొనసాగేలా ఉన్నాయి. ఇలాంటి సమయంలో పాక్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా మహ్మద్ ఆసిఫ్ యుద్ధం చేస్తామని హెచ్చరించడం సంచలనంగా మారింది. ‘మాకో ఆప్షన్ ఉంది. ఇప్పుడు ఎలాంటి ఒప్పందం జరగకపోతే వారిపై యుద్ధం చేస్తాం. కానీ, వాళ్లు శాంతి కోరుకుంటున్నట్లు కనిపిస్తోంది’ అని ఖవాజా చెప్పినట్లు రాయిటర్స్ పేర్కొంది.
News October 25, 2025
ఇండస్ట్రీలో ‘Male Ego’ని ఎదుర్కోవాలి: జాన్వీ

ఇండస్ట్రీలో ఒక్కోసారి తమని తాము తక్కువ చేసుకోవాల్సి వస్తుందని హీరోయిన్ జాన్వీ కపూర్ తెలిపారు. ఓ టాక్ షోలో ఇండస్ట్రీలో పురుష అహంకారంపై ఓపెన్ కామెంట్స్ చేశారు. ‘ఇక్కడ కొనసాగాలంటే మేల్ ఈగోని ఎదుర్కోవాలి. నలుగురు మహిళలుంటే నా అభిప్రాయం నిర్భయంగా చెప్తా. అదే ప్లేస్‌లో పురుషులుంటే నా ఒపీనియన్ చెప్పలేను. మనకు నచ్చని విషయాలను నేను చేయను అని చెప్పలేక.. అర్థం కాలేదు అని చెప్పాల్సి వస్తుంది’ అని తెలిపారు.


