News October 8, 2024
కేజీబీవీల్లో 729 ఉద్యోగాలు.. ఆప్లై చేశారా?

AP: రాష్ట్రంలోని కేజీబీవీల్లో 729 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నెల 15 వరకు దరఖాస్తులు స్వీకరించనుండగా అప్లికేషన్లు MEO ఆఫీసులో అందజేయాలని అధికారులు తెలిపారు. వీటిని ఔట్ సోర్సింగ్ ద్వారా రిక్రూట్ చేయనున్నారు. ఈ నెల 22న తుది జాబితాను ప్రకటిస్తారు. కాగా అంతకుముందు KGBVల్లోనే <<14235369>>604 పోస్టులకు<<>> నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
Similar News
News March 19, 2026
అకాల వర్షం.. రైతన్నకు తీరని కష్టం

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు రైతులకు తీరని నష్టం మిగిల్చాయి. నిన్న కోస్తా, రాయలసీమతోపాటు TGలో అక్కడక్కడ గాలివాన బీభత్సం సృష్టించింది. గంటకు 30-40 KMతో ఈదురుగాలులు, వడగళ్ల వానతో అరటి, మామిడి, మొక్కజొన్న, మినుములు, వరి దెబ్బతిన్నాయి. మరోవైపు పిడుగులు పడి APలోని బాపట్ల, పల్నాడు, గుంటూరు, TGలోని వనపర్తిలో ఒక్కరు చొప్పున మరణించారు. వికారాబాద్ జిల్లాలో పిడుగుపాట్లకు 300 మేకలు చనిపోయాయి.
News March 19, 2026
నేడే జాబ్ క్యాలెండర్.. 5 శాఖల్లో 8,340 పోస్టులు!

AP: రాష్ట్ర ప్రభుత్వం నేడు 10 వేల పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయనుంది. ఇందులో 5 శాఖల్లోనే 8,340 ఖాళీలు ఉన్నట్లు తెలుస్తోంది. అత్యధికంగా విద్యాశాఖలో 4,500 పోస్టులు ఉన్నాయని సమాచారం. వర్సిటీల్లో 1,500, DSC, ఇతర పోస్టులు 3 వేలు, హోంశాఖలో 3 వేలు, ఎక్సైజ్ శాఖలో 450 ఉద్యోగాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాదిలో 4 దశల్లో వీటిని భర్తీ చేసే అవకాశం ఉంది. మంత్రి లోకేశ్ ఈ క్యాలెండర్‌ను రిలీజ్ చేయనున్నారు.
News March 19, 2026
కొత్త డీజీపీ రేసులో ముగ్గురు!

TG: డీజీపీ నియామకానికి అర్హులైన ముగ్గురు అధికారుల లిస్టు రాష్ట్ర ప్రభుత్వానికి చేరింది. సీవీ ఆనంద్(1991 బ్యాచ్), వినయ్ ప్రభాకర్ ఆప్టే(1994 బ్యాచ్), సౌమ్యా మిశ్రా(1994 బ్యాచ్)తో కూడిన ఫైనల్ లిస్టును యూపీఎస్సీ పంపింది. ప్రస్తుతం హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న సీవీ ఆనంద్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. డీజీపీ శివధర్ రెడ్డి పదవీ కాలం ఏప్రిల్ 30తో ముగియనుంది.


