News October 11, 2024

50 ఏళ్లలో 73శాతం అంతరించిపోయిన జంతుజాలం: నివేదిక

image

1970-2020 మధ్యకాలంలో(50 ఏళ్లు) ప్రపంచంలోని జంతుజాలంలో 73శాతం అంతరించిపోయింది. ప్రపంచ వన్యప్రాణి నిధి(WWF) సంస్థ ఈ విషయాన్ని తాజాగా వెల్లడించింది. అడవుల నరికివేత, వేట, పర్యావరణ మార్పులు దీనికి కారణమని తెలిపింది. మంచినీటి జీవజాతులైతే ఏకంగా 85శాతం మేర తగ్గిపోయాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఇతర జీవాలకు, మనుషులకు, ప్రకృతికి కూడా ఇది చాలా ప్రమాదకర పరిణామమని హెచ్చరించింది.

Similar News

News October 11, 2024

ఆరోగ్యానికి సీతాఫలం

image

ఈ సీజన్‌లో సీతాఫలాలు ఎక్కువగా లభిస్తాయి. వీటిని తినడం మేలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఇమ్యూనిటీని పెంచే గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయని తెలిపారు. ఫైబర్ ఎక్కువగా ఉండటంతో మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. డిప్రెషన్‌కు లోనవ్వకుండా చేయడమే కాకుండా హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్, క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుతాయని చెబుతున్నారు.

News October 11, 2024

నేటి నుంచి రంజీ ట్రోఫీ

image

దేశంలో ప్రతిష్ఠాత్మక రంజీ ట్రోఫీ ఇవాళ ప్రారంభం కానుంది. 2024-25 సీజన్ దాదాపు 5 నెలలు కొనసాగనుంది. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు ఫిబ్రవరి 8 నుంచి, సెమీ ఫైనల్స్ 17 నుంచి, 26న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. మొత్తం 32 జట్లను 4 గ్రూప్‌లుగా విభజించారు. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ముంబై బరిలో దిగనుంది. ఓవరాల్‌గా ఆ జట్టు ఏకంగా 42 సార్లు ట్రోఫీని సొంతం చేసుకుంది.

News October 11, 2024

రతన్ టాటాపై పేటీఎం సీఈవో ట్వీట్.. నెటిజన్ల విమర్శలు

image

పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ వర్మ ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటాపై చేసిన ట్వీట్ విమర్శలకు దారి తీసింది. ప్రతి తరానికి స్ఫూర్తినిచ్చే లెజెండ్‌ను కోల్పోయామని పేర్కొంటూ చివర్లో టాటా బై బై అంటూ విజయ్ శేఖర్ రాసుకొచ్చారు. దీంతో దిగ్గజానికి వీడ్కోలు పలికే పద్దతి ఇదేనా అంటూ నెటిజన్లు మండిపడ్డారు. ఇది సరికాదంటూ హితవు పలికారు. అయితే కాసేపటికే ఆయన ట్వీట్ డిలీట్ చేశారు.