News February 26, 2026

731 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

<>హిందుస్థాన్ <<>>పెట్రోలియం కార్పొరేషన్ 731 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గలవారు మార్చి 25 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిప్లొమా, డిగ్రీ, BE/BTech, MBA, CA/CMA, MSc అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, CBT/రాత పరీక్ష/ టైపింగ్ టెస్ట్, గ్రూప్ టాస్క్, సైకోమెట్రిక్ అసెస్‌మెంట్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: hindustanpetroleum.com

Similar News

News March 2, 2026

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్ లేనివారికి శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోంది. కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి శిలాతోరణం వరకు భక్తుల క్యూ ఉంది. నిన్న 83,112 మంది వేంకటేశ్వరుడిని దర్శించుకోగా 30,054 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.49కోట్లు వచ్చినట్లు TTD తెలిపింది. రేపు చంద్ర గ్రహణం సందర్భంగా ఆలయాన్ని మూసేయనున్నారు.

News March 2, 2026

IAFలో అగ్నివాయు నాన్ కంబాటెంట్ పోస్టులు

image

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌(IAF)లో అగ్నివాయు నాన్ కంబాటెంట్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. టెన్త్ అర్హతతో పాటు శారీరక ప్రమాణాలు కలిగిన వారు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. జులై 2, 2005-జనవరి 2, 2009 మధ్య జన్మించి ఉండాలి. స్క్రీనింగ్, రాత పరీక్ష, PFT, మెడికల్ టెస్ట్, DV ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://agnipathvayu.cdac.in

News March 2, 2026

సంచలన ఆరోపణ.. మావోలపై విషపు తూటాలు?

image

నక్సల్స్‌ను అంతం చేసేందుకు ఎన్‌కౌంటర్లలో విషపు తూటాలు వాడారంటూ ఓ మావోయిస్టు అగ్రనేత ‘ఫినిక్స్’ పేరిట రాసిన కథనం సంచలనం రేపుతోంది. ‘బుల్లెట్ షెల్స్ తగిలిన సహచర మావోలు తీవ్రమైన నొప్పి, భరించలేని మంట, విపరీతమైన దాహం, వాంతులతో నరకం అనుభవించారు’ అని పేర్కొన్నారు. గతేడాది ఛత్తీస్‌గఢ్ గరియాబంద్ అడవుల్లో జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌‌ నుంచి తప్పించుకున్న ఆయన పార్టీకి రాసిన లేఖలో ఈ విషయాలు వెల్లడించారు.