News March 31, 2024

రైల్వేలో 733 ఉద్యోగాలు

image

సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే 733 అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతోంది. అభ్యర్థులు 10+2 విధానంలో 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ITI కోర్సుల్లో పాసై ఉండాలి. 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయసున్న వారు అర్హులు. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్ సందర్శించండి. చివరి తేదీ ఏప్రిల్ 12.
> secr.indianrailways.gov.in

Similar News

News January 24, 2026

నేడు నగరిలో చంద్రబాబు పర్యటన

image

AP: నేడు CM చంద్రబాబు చిత్తూరు(D) నగరిలో పర్యటించనున్నారు. 11AMకు నగరి జూ. కాలేజ్‌లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడే ప్రజల నుంచి అర్జీలు తీసుకుంటారు. తర్వాత శాప్ మైదానంలో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర ప్రజా వేదికలో పాల్గొంటారు. అక్కడ స్వచ్ఛ రథాలను ప్రారంభిస్తారు. అనంతరం జూనియర్ కాలేజ్ గ్రౌండ్‌లో TDP శ్రేణులతో సమావేశమవుతారు. సాయంత్రం తిరుగు పయనమవుతారు.

News January 24, 2026

డెయిరీ ఫామ్ ప్రారంభించే ముందు ఇవి చేయాలి

image

డెయిరీ ఫామ్ ప్రారంభానికి ముందు కొంత భూమిలో నేపియర్, గినీ గడ్డి, జొన్న.. మరి కొంత భూమిలో అలసంద, పిల్లిపెసర, లూసర్న్ పశుగ్రాసాలను సాగుచేయాలి. సుబాబుల్, అవిసె చెట్లను ఫామ్ పెట్టే స్థలం చుట్టూ కంచెలా వేయాలి. ఇలా పశుగ్రాసాన్ని పెంచి, షెడ్లు కట్టిన తర్వాత పరికరాలు, మందులు కొనుగోలు చేశాక పాడి పశువులను కొనాలంటున్నారు నిపుణులు. అధిక పాలిచ్చే పశువుకు ఉండే లక్షణాలు తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట క్లిక్ <<>>చేయండి.

News January 24, 2026

IRELలో 30 పోస్టులకు నోటిఫికేషన్

image

కేరళలోని ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్ (<>IREL<<>>) 30 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. BE/BTech, BCom, BSc, MBA, PG, డిప్లొమా, ఐటీఐ అర్హత గల అభ్యర్థులు NATS/NAPS పోర్టల్‌లో మార్చి 15వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వయసు 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.irel.co.in/