News December 29, 2024
ఈ ఏడాది 75 మంది ఉగ్రవాదులు హతం
JKలో ఈ ఏడాది 75 మంది ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు ఎన్‌కౌంటర్ చేశాయి. వీరిలో 60% మంది పాక్ ఉగ్రవాదులు ఉన్నట్టు ఆర్మీ వెల్లడించింది. ఈ ప్రాంతంలో కేవలం నలుగురు స్థానికుల్ని రిక్రూట్ చేయడం ద్వారా భారత్‌పై బయటిశక్తుల్ని ఎగదోయడంలో పాక్ పాత్ర స్పష్టమవుతోంది. హతమైన 75 మంది ఉగ్రవాదుల్లో మెజారిటీ విదేశీయులే ఉన్నారు. కొందరు LOC వద్ద చొరబడేందుకు యత్నించగా ఆర్మీ ఎన్‌కౌంటర్ చేసింది.
Similar News
News January 1, 2025
ఫార్ములా ఈ-రేసు కేసు: రేపటి నుంచి ఈడీ విచారణ
TG: ఫార్ములా ఈ-రేసు కేసు విచారణను ఈడీ వేగవంతం చేసింది. రేపటి నుంచి నిందితులను విచారించనుంది. HMDA మాజీ చీఫ్ BLN రెడ్డి రేపు ఈడీ ముందుకు రానున్నారు. ఎల్లుండి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్‌ను, ఈనెల 7న కేటీఆర్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. వీరు పెమా చట్టాన్ని ఉల్లంఘించి HMDA నిధులను విదేశీ కంపెనీకి బదిలీ చేశారని ఈడీ ఆధారాలు సేకరించినట్లు సమాచారం.
News January 1, 2025
కోహ్లీ కోసం రోహిత్‌పై చిన్నచూపేలా రవిశాస్త్రీ!
విరాట్, రోహిత్‌పై రవిశాస్త్రి భేదభావం చూపుతున్నారని నెటిజన్లు అంటున్నారు. విరాట్ మరో 3-4 ఏళ్లు ఆడగలరని, హిట్‌మ్యాన్ BGT తర్వాత ఆడటంపై నిర్ణయించుకోవాలనడంపై విమర్శిస్తున్నారు. 2024లో వారిద్దరిలో రోహితే బాగా ఆడారంటూ ఫ్యాన్స్ గణాంకాలు చూపిస్తున్నారు. VK బ్రాండ్ ఎండార్స్‌మెంట్లను రవిశాస్త్రి కొత్తగా స్థాపించిన ‘స్పోర్టింగ్ బియాండ్’ చూసుకుంటుండటంతోనే ఇలా అంటున్నారని ఆరోపిస్తున్నారు. మరి మీరేమంటారు?
News January 1, 2025
న్యూ ఇయర్.. వరుస మూవీల అప్డేట్స్
న్యూ ఇయర్ సందర్భంగా సినీ ప్రేమికులకు వరుస గిఫ్టులు వస్తున్నాయి. రాజమౌళి- మహేశ్ కాంబోలో వచ్చే సినిమా షూటింగ్ రేపు ప్రారంభం కానుంది. దీంతోపాటు నాని నటించిన ‘HIT3’ పోస్టర్, ‘బృందావన్ కాలని-2’ నుంచి స్పెషల్ పోస్టర్, ‘ఓ భామ అయ్యో రామ’ నుంచి పోస్టర్, సిద్ధూ జొన్నలగడ్డ నటించిన ‘జాక్’ రిలీజ్ డేట్‌తో పోస్టర్ విడుదలైంది. RAPO22 హీరోయిన్‌ను మేకర్స్ రివీల్ చేశారు.