News March 24, 2025
76 ఆలయాల పునర్నిర్మాణానికి రూ.143 కోట్లు: ఆనం

రాష్ట్రంలో 76 ఆలయాల పునర్నిర్మాణానికి రూ.143 కోట్లు మంజూరు అయ్యాయని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. సోమవారం నగరంలోని మూలాపేట వేణుగోపాలస్వామి దేవస్థానంలో ఆలయ పాలకమండలి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వంశపారంపర్యంగా ఆలయ ధర్మకర్తలుగా పని చేస్తున్నామన్నారు. వేణుగోపాల స్వామి దేవాలయంలో పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
Similar News
News December 22, 2025
నెల్లూరు: అన్నీ వాట్సాప్‌లోనే..!

నెల్లూరు జిల్లాలో చాలా ప్రభుత్వ సేవలు ఆన్లైన్లో దొరుకుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ మిత్ర ద్వారా అన్ని సేవలు అందిస్తోంది. ప్రజలు 9552300009 నంబర్ సేవ్ చేసుకుని వాట్సాప్‌లో హాయి అని పెడితే మీకు కావాల్సిన సేవలు చూపిస్తుంది. కొత్త రేషన్ కార్డులు, అందులో మార్పులు, చేర్పులకు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. 73373 59375 నంబర్‌కు రైతులు కాల్ చేస్తే ధాన్యం కొనుగోలు వివరాలు సైతం తెలుసుకోవచ్చు.
News December 22, 2025
నెల్లూరు: ఇద్దరు బీటెక్ యువకుల మృతి

నెల్లూరు రూరల్ కొత్త LNTకి చెందిన యుగంధర్ రెడ్డి(21) గూడూరు నారాయణ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. ఫ్రెండ్స్‌తో కలిసి శ్రీనివాససత్రం బీచ్‌కు వెళ్లాడు. అలల తాకిడికి యుగంధర్ రెడ్డి కొట్టుకెళ్లి చనిపోయాడు. అలాగే నెల్లూరు సిటీకి చెందిన హర్షసాయి(19) ఒంగోలులో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. ఫ్రెండ్స్‌తో కొత్తపట్నం బీచ్‌కు వెళ్లాడు. అలల్లో చిక్కుకున్న వారిని కాపాడటానికి హర్షసాయి వెళ్లి చనిపోయాడు.
News December 22, 2025
మీ చిన్నారికి పోలియో చుక్కలు వేయించారా.?

నెల్లూరు జిల్లాలో మొదటి రోజు 96.12 శాతం మంది చిన్నారులకు సిబ్బంది పోలియో చుక్కలు వేశారు. మొత్తం 2,94,604 మందికిగాను 2,83,173 మంది పిల్లలకు చుక్కల మందు ఇచ్చారు. మిగిలిన వారికి సోమ, మంగళవారాల్లో ఇంటింటికి తిరిగి ఇవ్వనున్నారు. మరి మీ పిల్లలకు పోలియో చుక్కలు వేయించారా.?


