News May 14, 2024
హల్దీరామ్స్‌లో 76 శాతం వాటా అమ్మకానికి సిద్ధం?
స్నాక్స్, స్వీట్స్ తయారీ సంస్థ హల్దీరామ్స్‌లో 76% వాటా కొనుగోలు చేసేందుకు విదేశీ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బ్లాక్‌స్టోన్, అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీల కన్సార్టియం $8.5 బిలియన్లను వెచ్చించడానికి సిద్ధమయ్యాయి. గత వారం బిడ్ దాఖలు చేశాయి. దీనిపై ఆయా కంపెనీల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 1937లో ప్రారంభమైన హల్దీరామ్స్ FY2022లో రూ.8,870 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.
Similar News
News January 4, 2025
HMPV.. డేంజర్ లేదన్నారంటే ప్రమాదమే: నెటిజన్ల మీమ్స్
చైనాలో విస్తరిస్తోన్న HMPV ప్రపంచదేశాలను హడలెత్తిస్తోంది. అయితే దాంతో ప్రమాదం లేదని ప్రభుత్వ వర్గాలు చెప్పడంపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. 2020లో కరోనా గురించి కూడా ఇలానే చెప్పారంటూ పోస్టులు చేస్తున్నారు. వాళ్ల ప్రకటన తర్వాత నిజంగా భయమేస్తోందని పలువురు పేర్కొంటున్నారు. 2020, 2025 జనవరి క్యాలెండర్లు ఒకేలా ఉన్నాయంటున్నారు. అప్రమత్తంగా ఉండటమే మంచిదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మీరేమంటారు?
News January 4, 2025
డీమార్ట్ షేర్లు రయ్.. రయ్
Dmartను ఆపరేట్ చేసే Avenue Supermarts Ltd షేరు ధర శుక్రవారం ఒక్కరోజులో 11.10% దూసుకెళ్లింది. గత సెప్టెంబర్ నుంచి Down Trendలో ఉన్న షేరు ధర Q3 ఫలితాలు ఇన్వెస్టర్లను మెప్పించడంతో ప్రారంభ సెషన్లో 15% వరకు ఎగసింది. చివరికి 11% మేర రాణించి ₹4,011 వద్ద స్థిరపడింది. అలాగే CLSA బ్రోకరేజ్ ASLకు Outperform రేటింగ్ ఇచ్చి ₹5,360 Target Price సెట్ చేయడం కూడా భారీ కొనుగోళ్లకు కారణమైంది.
News January 4, 2025
ఢిల్లీని కమ్మేసిన మంచు.. 470 విమానాలు ఆలస్యం
దేశ రాజధానిని పొగమంచు దట్టంగా కమ్మేసింది. కొన్ని ప్రాంతాల్లో ఎదుటి వ్యక్తి కనిపించనంత తీవ్రంగా ఉంది. దీంతో ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి రాకపోకలు సాగించే 470 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని అధికారులు తెలిపారు. పౌరులు బయట తిరిగేందుకు భయపడే స్థాయిలో పొగ కమ్ముకోవడం గమనార్హం. దీంతో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి.