News December 7, 2025

764 ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

DRDOకు చెందిన సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్‌మెంట్‌లో 764 ఉద్యోగాలకు షార్ట్ నోటిఫికేషన్ వెలువడింది. ఈ నెల 9 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్‌-B 561, టెక్నీషియన్-A 203 పోస్టులున్నాయి. వయసు 18-28 ఏళ్లు ఉండాలి. ఒకట్రెండు రోజుల్లో పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ https://www.drdo.gov.in/లో అందుబాటులో ఉంటుంది.

Similar News

News December 8, 2025

T20WC.. ‘స్ట్రీమింగ్’ నుంచి తప్పుకున్న జియోహాట్‌స్టార్!

image

వచ్చే ఏడాది T20WC స్ట్రీమింగ్‌ బాధ్యతల నుంచి జియో హాట్‌స్టార్ తప్పుకున్నట్లు నేషనల్ మీడియా వెల్లడించింది. రెండేళ్ల అగ్రిమెంట్ ఉన్నప్పటికీ తీవ్రమైన ఆర్థిక సమస్యలతో కొనసాగలేమని ICCకి సమాచారం ఇచ్చినట్లు పేర్కొంది. దీంతో నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, సోనీ పిక్చర్స్ రేసులోకి వచ్చినట్లు తెలిపింది. ఇదే నిజమైతే టోర్నీ వీక్షించడానికి సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే. ప్రేక్షకుల జేబుకు చిల్లు పడటం ఖాయం.

News December 8, 2025

అంజూ బాబీ జార్జ్‌.. ఎందరికో ఆదర్శం

image

మన దేశానికి వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో తొలి పతకం తెచ్చిన క్రీడాకారిణి అంజూ బాబీ జార్జ్. కేరళకు చెందిన అంజూ ఒక జన్యుపరమైన సమస్యతో ఒకే కిడ్నీతో జన్మించినా.. దాన్ని అధిగమించి ఎన్నో పతకాలు, అవార్డులు సొంతం చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అర్జున, ఖేల్‌రత్న, పద్మశ్రీ పురస్కారాలతో పాటు వరల్డ్ అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ నుంచి వుమెన్‌ ఆఫ్ ది ఇయర్‌ అవార్డ్ గెలుచుకొని ఎందరికో ఆదర్శంగా నిలిచారు.

News December 8, 2025

నేపాల్‌లో అతిపెద్ద అవినీతి కేసు.. ఫేక్ బిల్లులతో!

image

నేపాల్‌లో చైనా నిర్మించిన పొఖారా అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ అవినీతి జరిగింది. దీనిని $216 మిలియన్లతో పూర్తి చేయగా ఇందులో $74M(రూ.600కోట్లు) అవినీతి జరిగినట్లు విచారణలో తేలింది. చైనా కాంట్రాక్టర్‌తో ఏవియేషన్ అధికారులు, మాజీ మంత్రులు(5) కుమ్మక్కై ఫేక్ బిల్లులతో ప్రాజెక్ట్ వ్యయాన్ని $74M పెంచారు. కాగా ఇలా ఫేక్ బిల్లులతో వ్యయాన్ని పెంచి ప్రజలపై అప్పుల భారాన్ని పెంచుతున్నారనే చర్చ జరుగుతోంది.