News September 7, 2025
అందుబాటులో 77,396 మెట్రిక్ టన్నుల ఎరువులు: సీఎం

AP: రాష్ట్రంలో 77,396 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని CM చంద్రబాబు తెలిపారు. ‘రేపు కాకినాడకు షిప్ ద్వారా 15వేల మెట్రిక్ టన్నుల ఎరువులు వస్తాయి. మరో 10 రోజుల్లో 41 వేల టన్నుల ఎరువులు రానున్నాయి. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల నుంచి జిల్లా కలెక్టర్ వరకు క్షేత్రస్థాయిలో పర్యటించి ఎరువుల సరఫరాను పరిశీలించాలి’ అని టెలీ కాన్ఫరెన్సులో ఉన్నతాధికారులను CM ఆదేశించారు.
Similar News
News September 7, 2025
నేడు ఈ జిల్లాల్లో వర్షాలు: APSDMA

AP: వాయవ్య బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా- ఉత్తరాంధ్ర తీరాల మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
News September 7, 2025
ఐదేళ్లలో 50 వేల మందికి విదేశాల్లో ఉద్యోగాలు: మంత్రి లోకేశ్

AP: సీడాప్ ద్వారా వచ్చే ఐదేళ్లలో 50 వేల మందికి విదేశాల్లో ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు మంత్రి లోకేశ్ తెలిపారు. ఈ నెలలోనే నైపుణ్యం పోర్టల్‌ను ప్రారంభిస్తామన్నారు. అంతర్జాతీయ ప్లేస్ మెంట్ పథకం కింద జర్మనీ ఆసుపత్రుల్లో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులను అభినందించారు. తొలి బ్యాచ్‌లో సీడాప్ ద్వారా మొత్తం 171 మందికి శిక్షణనివ్వగా, ఇప్పటికే వివిధ విభాగాల్లో 40 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారని తెలిపారు.
News September 7, 2025
రాబోయే 2 గంటల్లో వర్షం

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే 2 గంటల్లో వర్షం పడుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, ఉమ్మడి కరీంనగర్, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, ఖమ్మం, ములుగు, నిజామాబాద్, సూర్యాపేట, వరంగల్ జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.