News September 11, 2024
వరదలకు ఖమ్మంలో రూ.783 కోట్ల నష్టం: మంత్రి తుమ్మల

TG: ఖమ్మం జిల్లాలో ఇటీవల సంభవించిన వరదలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ వరదలకు రూ.783 కోట్ల నష్టం జరిగినట్లు తెలిపారు. 15,196 ఇళ్లు దెబ్బతిన్నాయన్నారు. ఖమ్మంలో ఆరుగురు మృతిచెందారని తెలిపారు. మృతుల కుటుంబాలకు పరిహారం అందజేసినట్లు వెల్లడించారు. ఒక్కో కుటుంబానికి రూ.16,500 వరద సాయం ప్రకటించినట్లు పేర్కొన్నారు.
Similar News
News January 30, 2026
2026 జాబ్ మార్కెట్: 40sలో లేఆఫ్.. 20sలో బోరింగ్

2026లో జాబ్ మార్కెట్ తీరుపై ఇండియా టుడే ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. 40sలో ఓవర్ క్వాలిఫైడ్ సాకుతో లేఆఫ్‌లు ఉంటాయి. 20sలో ఉద్యోగం పొందిన వారికి తరచూ ‘ఇక్కడ ఉండటం నీ లక్కీ’ లాంటి మాటలు వినిపిస్తాయి. మేనేజర్ తక్కువ ప్రాజెక్టులు ఇస్తారు. దీంతో ఫ్యూచర్‌పై ఆందోళన, విసుగు చెందడం ఉద్యోగి వంతవుతుంది. ఈ పరిస్థితికి కంపెనీలనే తప్పుపట్టకుండా స్థిరత్వం కోసం స్కిల్స్‌పై దృష్టిపెట్టాలంటున్నారు రిక్రూటర్లు.
News January 30, 2026
సకుంభ నికుంభుల అంతం ఎలా జరిగిందంటే..?

కుంభకర్ణుడి కొడుకులైన సకుంభ నికుంభులు లోకకంటకులుగా మారి, విభీషణుడి లంకపై దాడి చేశారు. వారి ధాటికి తట్టుకోలేక విభీషణుడు రాముడిని శరణు వేడాడు. యుద్ధంలో దానవులు యమదండంతో భరత శత్రుఘ్నులను మూర్ఛిల్లజేయగా, రాముడు ఆగ్రహించి వాయవ్యాస్త్రంతో ఆ సోదరులను సంహరించాడు. అనంతరం హనుమంతుడు అమృత కలశాన్ని తెచ్చి రామ సోదరులను పునర్జీవితులను చేశాడు. ఇలా రాముడు విభీషణుడిని ఆపద నుంచి కాపాడి ధర్మాన్ని నిలబెట్టాడు.
News January 30, 2026
‘జనగణమన’లో ఉత్కళ అంటే ఏంటో తెలుసా?

రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన జాతీయ గీతం ‘జనగణమన’లో ఉత్కళ అనేది ఇప్పటి ఒడిశా. ఉత్ (ఉత్తమమైన)+ కళ (కళలు)-ఉత్తమమైన కళల భూమి అని అర్థం. కోణార్క్ సూర్య దేవాలయం, పూరీ జగన్నాథ్ టెంపుల్, ఒడిస్సీ నృత్యానికి ఆ రాష్ట్రం ప్రసిద్ధి. కళింగ యుద్ధం తర్వాత అశోకుడు శాంతి మార్గాన్ని ఎంచుకున్నది ఇక్కడేనని చరిత్ర చెబుతోంది. ఉత్కళ అని పలకగానే కళ, చరిత్ర, భక్తి, శాంతి గుర్తురావాలనే ఆ పదాన్ని జాతీయ గీతంలో చేర్చారు.


