News July 30, 2024
బీటెక్ పూర్తి చేసిన వారికి 7,951 ఉద్యోగాలు

రైల్వేలో 7,951 జూనియర్ ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ నేటి నుంచి ప్రారంభమైంది. ఇంజినీరింగ్ డిగ్రీ లేదా డిప్లొమా కలిగి ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 36 ఏళ్లు. పోస్టును బట్టి జీతం నెలకు రూ.35,400 నుంచి రూ.44,900 వరకు ఉంది. చివరి తేదీ: ఆగస్టు 29. స్టేజ్-1, స్టేజ్-2 కంప్యూటర్ టెస్టులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటాయి. దరఖాస్తు చేసుకునేందుకు <
Similar News
News November 19, 2025
DRDO CFEESలో అప్రెంటిస్ పోస్టులు

DRDO అనుబంధ సంస్థ సెంటర్ ఫర్ ఫైర్, ఎక్స్‌ప్లోజివ్& ఎన్విరాన్మెంట్ సేఫ్టీ (CFEES) 38 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు DEC 10 వరకు అప్లై చేసుకోవచ్చు. టెన్త్, ITI ఉత్తీర్ణులై, 18- 27ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గల అభ్యర్థులకు ఏజ్‌లో సడలింపు ఉంది. ముందుగా ncvtmis.gov.in పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. స్టైపెండ్ నెలకు రూ.9600 చెల్లిస్తారు. https://www.drdo.gov.in/
News November 19, 2025
పోలీస్ కస్టడీకి ఐ-బొమ్మ రవి

TG: ఐ-బొమ్మ రవి పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. విచారణలో మరిన్ని వివరాలు రాబట్టాలని పోలీసులు కోరగా 5 రోజులు కస్టడీకి ఇస్తున్నట్లు పేర్కొంది. కొత్త సినిమాలను ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో హ్యాక్ చేసి ఐబొమ్మ వెబ్సైట్లో పెట్టే రవిని ఇటీవల హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి ఖాతాలోని రూ.3కోట్లను ఫ్రీజ్ చేశారు. బెట్టింగ్ యాప్‌ల ద్వారా రవి రూ.కోట్లు సంపాదించినట్లు గుర్తించారు.
News November 19, 2025
గర్భసంచి కిందికి ఎందుకు జారుతుందంటే?

పెల్విక్ ఫ్లోర్ కండరాలు, స్నాయువులు గర్భాశయానికి సపోర్ట్ ఇవ్వనప్పుడు, ఎక్కువగా సాగి, బలహీనమైనప్పుడు గర్భాశయ ప్రోలాప్స్ వస్తుంది. దీనివల్ల గర్భాశయం యోనిలోకి ప్రవేశించడం, పొడుచుకు రావడం జరుగుతుంది. మెనోపాజ్, ఎక్కువ సాధారణ ప్రసవాలు జరిగితే ఈ సమస్య వస్తుంది. దీని ట్రీట్మెంట్ మహిళ వయసు, ఇతర కారణాలపై ఆధారపడి ఉంటుంది. సమస్యను గుర్తించిన వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.


