News October 7, 2024
RRBలో 7951 జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాలు.. పరీక్ష తేదీల ప్రకటన

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) జూనియర్ ఇంజినీర్ పోస్టుల పరీక్ష తేదీలను ప్రకటించింది. డిసెంబర్ 6 నుంచి 13 వరకు కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఎగ్జామ్స్ ఉంటాయని తెలిపింది. దీని ద్వారా RRB మొత్తం 7951 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఇక అసిస్టెంట్ లోకో పైలట్ పరీక్షలు నవంబర్ 25-29 వరకు, RPF ఎస్సై ఎగ్జామ్స్ డిసెంబర్ 2-5 వరకు, టెక్నీషియన్ ఎగ్జామ్స్ డిసెంబర్ 16-26 వరకు ఉంటాయని వివరించింది.
Similar News
News December 25, 2025
PHOTOS: జగన్ క్రిస్మస్ వేడుకలు

AP: పులివెందుల పర్యటనలో ఉన్న YCP చీఫ్ జగన్ ఫ్యామిలీతో కలిసి స్థానిక CSI చర్చ్లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనలు చేసి అందరితో కలిసి కేక్ కట్ చేశారు. తల్లి విజయమ్మ ఆయనను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టారు. జగన్ను చూసేందుకు వైసీపీ కార్యకర్తలు, స్థానికులు పెద్ద ఎత్తున చర్చ్ ప్రాంగణానికి చేరుకున్నారు. వారందరికీ జగన్ అభివాదం చేసుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
News December 25, 2025
మతం, ధర్మం.. రెండూ ఒకటేనా?

వీటి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. మతం ఓ నిర్దిష్ట దైవాన్ని పూజించే పద్ధతి. ఇది గ్రంథం, నమ్మకాల చుట్టూ తిరుగుతుంది. ఇది మనుషులు ఏర్పాటు చేసుకున్న ఓ వ్యవస్థ. కానీ ధర్మం అనేది విశ్వవ్యాప్తమైనది. ‘ధరించునది’ అని దీని అర్థం. అంటే సత్యం, అహింస, బాధ్యత, మానవత్వాన్ని పాటించడం. మతం మారవచ్చు కానీ ధర్మం (ఉదాహరణకు: తల్లిగా ధర్మం, మనిషిగా ధర్మం) ఎప్పటికీ మారదు. మతం వ్యక్తిగతమైనది. ధర్మం సామాజికమైన క్రమశిక్షణ.
News December 25, 2025
ఎన్కౌంటర్లో ఆరుగురు మావోలు హతం.. నక్సల్స్ రహిత రాష్ట్రంగా ఒడిశా!

ఒడిశాలోని కందమాల్లో జరిగిన ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మరణించినట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. వీరిలో కేంద్ర కమిటీ సభ్యులు, నల్గొండ(D) పుల్లెంల వాసి గణేశ్ ఉయికె అలియాస్ పాక హన్మంతు ఉన్నారని తెలిపింది. 40 ఏళ్లుగా ఉద్యమంలో చురుగ్గా ఉన్న ఆయనపై రూ.1.10 కోట్ల రివార్డు ఉంది. ఒడిశా నక్సల్స్ రహిత రాష్ట్రంగా మారిందని, వచ్చే ఏడాది మార్చి 31కల్లా దేశంలో నక్సలిజాన్ని అంతమొందిస్తామని పేర్కొంది.


