News January 6, 2025

8న జిల్లాస్థాయి రంగోత్సవ్ పోటీలు: DEO

image

గుంటూరు జిల్లా విద్యా శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 8న “రంగోత్సవ్” జిల్లాస్థాయి పోటీలను నిర్వహిస్తున్నట్లు గుంటూరు డీఈవో సీవీ రేణుక సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన జూనియర్ కళాశాలల విద్యార్థులు, ప్రైవేట్ స్కూల్స్‌లో 6 నుంచి 12వ తరగతి విద్యార్థులు పోటీల్లో పాల్గొనేందుకు అర్హులన్నారు. 8 అంశాల్లో పోటీలు జరుగుతాయని, dietboyapalemguntur@gmail.comలో సంప్రదించాలన్నారు. 

Similar News

News January 9, 2025

కేంద్ర ప్రభుత్వం రూ. 2.5 లక్షల ఆర్థిక సహాయం: బాపట్ల కలెక్టర్

image

జిల్లాలో అర్హులైన నిరుపేదలందరూ పిఎంఏ వై 2.0 పథకం క్రింద ఇల్లు నిర్మించుకోడానికి కేంద్ర ప్రభుత్వం రూ.2.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తుందని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి తెలిపారు. విజన్ బాపట్ల-2047 అమలు ప్రణాళికపై 14 శాఖల అధికారులతో బుధవారం బాపట్ల కలెక్టరేట్లో ఆయన సమీక్ష నిర్వహించారు. సందర్భంగా అధికారులకు సిబ్బందికి పలు సలహాలు, సూచనలు చేశారు.

News January 9, 2025

మంగళగిరి: శ్రీలక్ష్మీ నరసింహ ఆలయం చరిత్ర తెలుసా?

image

వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని మంగళగిరిలోని శ్రీలక్ష్మి నరసింహ ఆలయం ముస్తాబవుతోంది. ఈ క్షేత్రం అష్టమహాక్షేత్రాల నరసింహాలలో ఒకటిగా ప్రసిద్ధిగాంచింది. కొండపైన, దిగువన ఉన్న 3 దేవాలయాలు ఉన్నాయి. ఈదేవాలయాన్ని పాండవ సోదరుడు యుధిష్ఠిరుడు స్థాపించాడని ఇక్కడి చరిత్ర. కొండపై ఉన్న గుడిలో విగ్రహం లేదు. నోరు ఆకారంలో కేవలం తెరిచిన రంధ్రం మాత్రమే ఉంటుంది. తెరుచుకున్న రంధ్రమే పానకాలస్వామి అని ప్రజలు నమ్మకం.

News January 8, 2025

విజయపురిసౌత్‌: వివాహిత అనుమానాస్పద మృతి

image

వివాహిత అనుమానస్పదంగా మృతి చెందిన ఘటన పల్నాడు(D) మాచర్ల మండలంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విజయపురిసౌత్‌కు చెందిన బత్తుల కల్పన (28) ఉరి వేసుకుందంటూ భర్త సురేశ్ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి చనిపోయినట్లు నిర్ధారించారు. అయితే అనుమానం వచ్చిన వైద్య సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు భర్త సురేశ్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.