News April 3, 2025
8న పాపిరెడ్డిపల్లికి వైఎస్ జగన్

మాజీ సీఎం వైఎస్ జగన్ ఈ నెల 8న రాప్తాడు నియోజకవర్గంలో పర్యటిస్తారని వైసీపీ నేత తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. పాపిరెడ్డిపల్లిలో ఇటీవల హత్యకు గురైన లింగమయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారని పేర్కొన్నారు. జగన్ పర్యటనకు జిల్లాలోని ప్రజాస్వామ్యవాదులు, అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చాక దుర్మార్గాలు, దౌర్జన్యాలు ఎక్కువయ్యాయని ఆయన మండిపడ్డారు.
Similar News
News April 11, 2025
రేపే రిజల్ట్.. అనంతపురం జిల్లా విద్యార్థుల్లో ఉత్కంఠ!

ఇంటర్ ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి. అనంతపురం జిల్లాలో ఫస్టియర్ 25,730 మంది, సెకండియర్ 22,960 మంది విద్యార్థులు ఉన్నారు. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.
☞ వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
News April 11, 2025
రామగిరి ఎస్ఐ దాచింది.. దోచింది ఎక్కువే: వైసీపీ

రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్‌పై వైసీపీ తీవ్ర విమర్శలు చేసింది. ‘ఆయనను చూసిన వాళ్లంతా ఆశ్చర్యపోతున్నారు. ఒకసారి సస్పెండ్ అయిన సుధాకర్ తెలుగుదేశం కార్యకర్త కన్నా ఎక్కువ ఉత్సాహంగా పార్టీ కోసం పని చేస్తున్నారని అంటున్నారు. పరిటాల సునీత అండతో అరాచక శక్తిగా ఎదిగిన సుధాకర్ దాచింది.. దోచింది ఎక్కువే అని చర్చలు నడుస్తున్నాయి’ అంటూ ట్వీట్ చేసింది.
News April 11, 2025
గోరంట్ల మాధవ్‌పై మరో కేసు

ఐటీడీపీ కార్యకర్త కిరణ్‌పై దాడికి యత్నించిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై గుంటూరు నగరంపాలెం పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న ఆయనను నేడు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. మరోవైపు మంత్రి లోకేశ్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మాధవ్‌పై తాడేపల్లి పీఎస్‌లో మరో కేసు నమోదైంది. నిన్న ప్రెస్ మీట్‌లో లోకేశ్ గురించి అసభ్యకర వ్యాఖ్యలు చేశారని TDP నేతలు ఫిర్యాదు చేశారు.