News May 3, 2024
8న వరంగల్‌కు ప్రధాని మోదీ
ఈ నెల 8న వరంగల్ జిల్లాకు పార్లమెంట్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రానున్నారు. ఈ నేపథ్యంలో తిమ్మాపూర్(మామునూర్) సమీపంలోని సభ వేదిక వద్ద ఏర్పాట్లను ఎంపీ అభ్యర్థి ఆరూరీ రమేశ్, ఇతర నేతలు పరిశీలించారు. బహిరంగ సభకు వరంగల్ పరిధిలోని పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఆరూరి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News November 5, 2024
భీమదేవరపల్లి: బస్టాండులో భార్య కళ్లెదుటే భర్త మృతి
HNK జిల్లా భీమదేవరపల్లి మండలం గట్లనర్సింగపూర్ గ్రామానికి చెందిన కూన పోచయ్య (45) ముల్కనూరు బస్టాండులో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. 3 రోజుల క్రితం పోచయ్య భార్య రేణుక పండగకు తల్లిగారింటికి వెళ్లగా.. మద్యం తాగుతూ అప్పటి నుంచి బస్టాండులోనే ఉంటున్నాడు. సోమవారం అతడి భార్య ఇంటికి తీసుకువెళ్లేందుకు బస్టాండ్ వద్దకు వచ్చింది. నీళ్లు తాగించి నిమ్మరసం కోసం పక్కకు రాగానే కిందకు ఒరిగి మృతి చెందాడు.
News November 5, 2024
వరంగల్ డీఈవోకు విద్యాశాఖ షోకాజ్ నోటీసు
వరంగల్ డీఈవో ఎం.జ్ఞానేశ్వర్‌కు విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నరసింహ రెడ్డి సోమవారం షోకాజ్ నోటీసు జారీ చేశారు. డీఈవో కార్యాలయంలో సంబంధం లేని వ్యక్తిని సత్కరించినందుకు మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలంటు తాఖీదు ఇచ్చారు. వరంగల్ జిల్లా విద్యాశాఖతో సంబంధం లేని వ్యక్తిని అక్టోబర్ 30న వరంగల్ జిల్లా విద్యాశాఖాధికారి ఛాంబర్లో సత్కరించడం ప్రవర్తనా నియమాలకు విరుద్ధమని నోటీస్‌లో పేర్కొన్నారు.
News November 4, 2024
కాజీపేట రైల్వే కోచ్ ప్రాజెక్టు అంచనా రూ.680 కోట్లకు పెరిగింది: కిషన్ రెడ్డి
కాజీపేట రైల్వే కోచ్ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.680 కోట్లకు పెరిగిందని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. ఆదివారం రైల్వే అధికారులతో చర్చించిన అనంతరం మంత్రి ఈ మేరకు ప్రకటన చేశారు. సోమవారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టులో ఏటా దాదాపు 600ల రైల్వే కోచ్‌లు తయారవుతాయని వెల్లడించారు.