News November 5, 2024
8న వెంకటాచలంలో ఎస్టీల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ డే

సర్వేపల్లి నియోజకవర్గం చెముడు గుంటలోని శిరిడిస్ కళ్యాణ మండపంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో ఎస్టీల కోసం శుక్రవారం ప్రత్యేక గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. వెంకటచలం మండలంలోని తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రత్యేక ప్రజా విజ్ఞప్తుల పరిష్కార వేదికలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తొలుత ఆయన అర్జీదారుల నుంచి 550 పైగా అర్జీలు స్వీకరించారు.
Similar News
News December 24, 2025
తిరుపతిలో స్కాం.. AEO సూసైడ్పై చర్చ

తిరుపతి గోవిందరాజ స్వామివారి ఆలయ విమాన గోపురం బంగారు తాపడం పనుల్లో <<18647016>>స్కాం <<>>జరిగిందని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఉద్యోగుల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. నాటి AEOపై క్రమశిక్షణా రాహిత్యం కేసు ఎందుకు నమోదైంది? రిటైరయ్యే కొన్ని రోజుల ముందే ఆయన సూసైడ్ చేసుకోవడం సంచలనంగా మారింది. ఆయన రిటైర్మెంట్ ముందు కూడా ఆ కేసు ఎందుకు క్లియర్ కాలేదనేది నేటికి ప్రశ్నగా మిగిలింది.
News December 24, 2025
వరికి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలి : కలెక్టర్

జిల్లాలో ఖరీఫ్, రబీ సీజన్లలో వరికి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహిస్తూ, ఆయా పంటలకు రుణాల పరిమితిని పెంచుతున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు. కలెక్టర్ చాంబర్లో వివిధ పంటలకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఖరారు చేయుటకు జిల్లాస్థాయి టెక్నికల్ కమిటీ మీటింగ్ కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో 2026 ఖరీఫ్, 2026-27 రబీ సీజన్లకు సంబంధించి రైతులకు పంట రుణాల మంజూరుపై కమిటీ చర్చించింది.