News December 29, 2024

8వ జాతీయ స్థాయి రింగ్ ఫైట్ పోటీలు ప్రారంభం

image

8వ జాతీయ స్థాయి రింగ్ ఫైట్ పోటీలు కర్నూలు బీ.క్యాంపులోని టీజీవీ కళ్యాణ మండపంలో ఆదివారం ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా జాతీయ రింగ్ పైట్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రవికుమార్, ప్రభాకర్‌ హాజరై పోటీలను ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. రాష్ట్రాలలో అనేక జాతీయ స్థాయి పోటీలను నిర్విరామంగా నిర్వహించామని తెలిపారు. కార్యక్రమంలో పోటీల కార్యదర్శి అబ్దుల్లా పాల్గొన్నారు.

Similar News

News January 6, 2025

నంద్యాల: జాతీయ కుష్టి వ్యాధి నిర్మూలన పోస్టర్‌ ఆవిష్కరణ

image

కుష్టి వ్యాధి నిర్ధారణ కోసం ఈనెల 20వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు ఇంటింటి సర్వే కార్యక్రమం చేపట్టినట్లు కలెక్టర్ జి.రాజకుమారి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్ ఎస్‌లో భాగంగా కుష్టి వ్యాధి నిర్మూలన గోడ పత్రికను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ.. నంద్యాల జిల్లాలో ఈ సంవత్సరం ఇప్పటివరకు 85 మంది కొత్త రోగులను గుర్తించి వారికి చికిత్స అందించినట్లు స్పష్టం చేశారు. 

News January 6, 2025

గ్రీవెన్స్‌కు వచ్చే సమస్యలను త్వరితగతిన పరిష్కరించండి: జేసీ

image

గ్రీవెన్స్‌కు వచ్చే ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆదేశించారు. సోమవారం ఆదోనిలోని సబ్ కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రీవెన్స్‌కు వచ్చే సమస్యలపై నిర్లక్ష్యం చేయకూడదని అన్నారు. ఆయా శాఖల పరిధిలో ఉన్న సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.

News January 6, 2025

గడివేముల: రూ. లక్షలు డిపాజిట్ అయ్యాయ్.. వేరే వారికి పంపే వీలు లేదు

image

రూ. 3.24 లక్షలు ఖాతాలోకి జమచేసి బ్యాంకు అకౌంట్ హ్యాక్ చేసే యత్నం గడివేములలో ఆదివారం జరిగింది. పరమేశ్ బ్యాంకు ఖాతాలోకి రూ. 3.24 లక్షలు వచ్చినట్లు మెసేజ్ వచ్చింది, ఖాతాలోనూ చూపించింది. కానీ వేరే వారి ఖాతాకు పంపేందుకు చూస్తే కుదురలేదు. మరొకసారి బ్యాంకు ఖాతా చెక్ చేయగా.. డిపాజిట్ అయిన నగదుతో పాటు తన డబ్బులు రూ. 1.600 కూడా కట్ అయ్యాయి. బాధితుడు మోసాన్ని గుర్తించి అప్రమత్తమయ్యాడు.