News June 4, 2024

8వ రౌండ్‌లోనూ మాధవి రెడ్డి లీడింగ్

image

కడప అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవిరెడ్డి ఆధిక్యత కొనసాగుతున్నది. 8వ రౌండు ముగిసేసరికి 6013 ఆధిక్యంతో ముందంజలో కొనసాగుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అంజాద్ బాషా 27841 ఓట్లు రాగా మాధవిరెడ్డికి 33854 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి అఫ్జల్ ఖాన్‌కు 9094 ఓట్లు వచ్చాయి. లీడింగ్ చూస్తుంటే రౌండ్ రౌండ్కి ప్రజల్లో ఉత్కంఠత నెలకొంటుంది.

Similar News

News October 18, 2025

కడప: దీపావళి పండగకు 33 ప్రత్యేక బస్సులు

image

దీపావళి పండగ సందర్భంగా కడప జిల్లాలోని ఆరు డిపోల పరిధిలో 33 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ గోపాల్ రెడ్డి తెలిపారు. బెంగళూరు – చెన్నై, హైదరాబాదు – విజయవాడకు నడుస్తాయన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

News October 18, 2025

ఒంటిమిట్టకు తిరుమల లడ్డూలు

image

ఒంటిమిట్ట రామాలయానికి వచ్చే భక్తులకు 600 తిరుమల లడ్డూలు శనివారం అందుబాటులో ఉంటాయని ఆలయ అధికారి నవీన్ తెలిపారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఒక్కోటి రూ.50గా విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో ప్రసాదాలు పొందవచ్చన్నారు.

News October 18, 2025

అనుమతులు లేకుండా బాణాసంచా విక్రయాలు చేయరాదు: ఎస్పీ

image

పోలీసుల అనుమతి లేకుండా కడప జిల్లా వ్యాప్తంగా ఇళ్లల్లో బాణాసంచా నిలువలు కానీ బాణసంచా నిల్వలు, విక్రయాలు చేయరాదని ఎస్పీ నచికేత్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రదేశాల్లో మాత్రమే టపాసుల విక్రయాలు చేయాలని, అలా కాకుండా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.