News March 6, 2025

8న కర్నూలులో జాతీయ లోక్ అదాలత్

image

కర్నూలు జిల్లాలో ఈనెల 8వ తేదీన కోర్టుల్లో నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి విజ్ఞప్తి చేశారు. జిల్లా కోర్టులోని న్యాయ సేవా సదన్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని అన్ని న్యాయ స్థానాల్లో పెండింగ్‌లో ఉన్న రాజీపడే సివిల్, క్రిమినల్ కేసులను పరిష్కరించుకోవాలని కోరారు.

Similar News

News March 6, 2025

పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

image

జిల్లా వ్యాప్తంగా గురువారం జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షల్లో భాగంగా కలెక్టర్ రంజిత్ బాషా కర్నూలులోని ఉస్మానియా కళాశాల పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. పరీక్షా కేంద్రంలో మెరుగైన వసతులు కల్పించామని అన్నారు. విద్యార్థులకు ఏ అవస్థలు కలగకుండా అన్ని చర్యలను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. కలెక్టర్ వెంట ఇంటర్ బోర్డు అధికారులు ఉన్నారు.

News March 6, 2025

కర్నూలు: బొలెరో, బైక్ ఢీ.. వ్యక్తి దుర్మరణం

image

నందవరం మండలంలోని జోహారాపురం గ్రామ ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన కురువ చదువుల చక్రవర్తి(23) వ్యక్తిగత పనుల మీద బైకుపై వెళ్తుండగా పోలకల్ నుంచి రాయచూర్‌కు కందులు తరలిస్తున్న బొలెరో వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో చక్రవర్తి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు జయమ్మ, పోసరప్ప కుమారుడిగా గుర్తించారు.

News March 6, 2025

ఆత్మకూరులో రికార్డు స్థాయిలో ఎండ తీవ్రత

image

నంద్యాల జిల్లాలోని ఆత్మకూరులో దేశంలోనే రికార్డు స్థాయిలో ఎండ తీవ్రత నమోదయింది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల మేరకు బుధవారం ఆత్మకూరులో 40.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మార్చి మొదటి వారంలోనే ఈ తరహా ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కాగా.. ఇదే ఉష్ణోగ్రతలు మరికొన్ని రోజుల పాటు కొనసాగనున్నట్లు తెలిసింది.

error: Content is protected !!