News January 6, 2026
8వ రోజుకు చేరుకున్న వైకుంఠ ద్వార దర్శనాలు

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం 8వ రోజుకు చేరుకున్నాయి. మరో రెండు రోజుల బుధవారం, గురువారం రాత్రి వరకు సాగనున్నాయి. ఇప్పటివరకు లక్కి డిప్‌లో టోకెన్లు పొందిన స్థానికులు ఇవాళ నుంచి మూడు రోజులు దర్శనం చేసుకోనున్నారు. 7రోజు పాటు వైకుంఠ ద్వార దర్శనం 5,42,057 మంది భక్తులు చేసుకున్నారు.
Similar News
News January 9, 2026
MBNR: పిల్లలతో బైక్‌లపై వెళ్లేటప్పుడు తస్మాత్ జాగ్రత్త: ఎస్పీ

చిన్న పిల్లలను బైకులపై తీసుకెళ్లేటప్పుడు పిల్లలను ముందు కూర్చోబెట్టుకోవడం ప్రమాదకరమని MBNR జిల్లా ఎస్పీ జానకి హెచ్చరించారు. సంక్రాంతి వేళ ఎగురవేసే గాలిపటాల దారాలు వాహనదారుల మెడకు చుట్టుకునే ప్రమాదం ఉందని, పిల్లల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి, నెమ్మదిగా వాహనాలను నడుపుతూ తగు జాగ్రత్తలు పాటించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
News January 9, 2026
మల్యాల: ‘విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందించాలి’

విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనాన్ని అందించాలని కలెక్టర్ సత్యప్రసాద్ ఉపాధ్యాయులను ఆదేశించారు. మల్యాల మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల పాఠశాలను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల స్థితిగతులను, వారికి కల్పిస్తున్న వసతులను అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని సూచించారు. మెను ప్రకారం భోజనాన్ని అందించాలని, పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.
News January 9, 2026
భక్తుల సౌకర్యార్థం పక్కా ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఖచ్చితమైన ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. శుక్రవారం శ్రీశైలం కమాండ్ కంట్రోల్ రూమ్‌లో సమీక్ష నిర్వహించారు. భక్తులు సౌకర్యవంతంగా స్వామి, అమ్మవారిని దర్శించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. క్షేత్రానికి వచ్చే లక్షలాది మందికి అవసరమైన సౌకర్యాలను కల్పించేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.


