News June 30, 2024

8 నుంచి SKU తరగతులు ప్రారంభం

image

ఎస్కేయూ యూనివర్సిటీలో జులై 8 నుంచి తరగతులను ప్రారంభిస్తున్నట్లు ప్రిన్సిపల్ కృష్ణకుమారి తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. మే 15 నుంచి యూనివర్సిటీలో వేసవి సెలవులు ఇచ్చామన్నారు. జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభించాల్సి ఉండగా యూనివర్సిటీలో తాగునీటి సమస్య కారణంగా తరగతులు ప్రారంభించలేదు. జులై 8 నుంచి యూనివర్సిటీలో తరగతులతో పాటు వసతిగృహాలు ప్రారంభమవుతాయని వెల్లడించారు.

Similar News

News September 20, 2024

కూడేరు ఎంఈఓపై సస్పెన్షన్ వేటు

image

రెండు రోజుల క్రితం అనంతపురంలో రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన కూడేరు మండల విద్యాశాఖ అధికారి చంద్రశేఖర్‌ను సస్పెండ్ చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు. ఈ మేరకు కడప ఆర్జేడీ గురువారం సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేశారని పేర్కొర్నారు. గోటుకూరు వద్ద గల వెరీ డైన్ ఏ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం నుంచి లంచం డిమాండ్ చేశాడనే కారణంతో సస్పెండ్ చేశామన్నారు.

News September 20, 2024

ఐదేళ్ల ప్రణాళికలతో ప్రతి శాఖ నివేదిక రూపొందించాలి: కలెక్టర్

image

వంద రోజులు, వార్షిక, ఐదేళ్ల ప్రణాళికలతో ప్రతి శాఖ నివేదిక రూపొందించాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ మాట్లాడారు. 2024 నుంచి 2029 వరకు ఒక విజన్‌తో కూడిన నివేదిక అందజేయాలని పేర్కొన్నారు. జిల్లాలోని ప్రతి శాఖ వికసిత 2047 లక్ష్యసాధనలో నిర్ణాయక పాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు.

News September 19, 2024

ఉచిత ఇసుకను పారదర్శకంగా అందించేందుకు ఏర్పాట్లు: కలెక్టర్

image

శ్రీ సత్యసాయి జిల్లాలోని ఇసుక పాయింట్ల వద్ద నుంచి ఉచిత ఇసుకను పారదర్శకంగా అందించేందుకు ఏర్పాటు చేసినట్టు శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయం నుంచి గురువారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన అధికారులతో మాట్లాడారు. ఉచిత ఇసుక కోసం ప్రజలు ఆన్లైన్లో సులభతరంగా నమోదు చేసుకుని ప్రక్రియను క్రమబద్ధమైన రీతిలో రూపొందించామన్నారు.