News June 30, 2024

8 నుంచి SKU తరగతులు ప్రారంభం

image

ఎస్కేయూ యూనివర్సిటీలో జులై 8 నుంచి తరగతులను ప్రారంభిస్తున్నట్లు ప్రిన్సిపల్ కృష్ణకుమారి తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. మే 15 నుంచి యూనివర్సిటీలో వేసవి సెలవులు ఇచ్చామన్నారు. జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభించాల్సి ఉండగా యూనివర్సిటీలో తాగునీటి సమస్య కారణంగా తరగతులు ప్రారంభించలేదు. జులై 8 నుంచి యూనివర్సిటీలో తరగతులతో పాటు వసతిగృహాలు ప్రారంభమవుతాయని వెల్లడించారు.

Similar News

News October 13, 2024

రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు: కలెక్టర్

image

శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికను రద్దు చేసినట్టు కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. రేపటి నుంచి 16వ తేదీ వరకు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రత్యేక అధికారులు ఆయా మండలాల్లో ఉండాలని ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఈ వారం రద్దు చేసినట్లు తెలిపారు.

News October 13, 2024

అనంత జిల్లాలో రాష్ట్రస్థాయి వాల్మీకి జయంతి వేడుకలు: మంత్రి లోకేశ్

image

అనంతపురం జిల్లాలో రాష్ట్రస్థాయి వాల్మీకి జయంతిని నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. టీడీపీ బీసీల పుట్టినిల్లు అన్నారు. వారి ఆత్మ గౌరవాన్ని పెంచే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన మరో హామీని చంద్రబాబు నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం నెరవేరుస్తుందని అన్నారు. ఈనెల 17న అధికారికంగా అన్ని జిల్లా కేంద్రాలు నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేశారు.

News October 13, 2024

చిలమత్తూరు: గ్యాంగ్ రేప్ చేసింది వాళ్లేనా..?

image

శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలో అత్త, కోడలిపై గ్యాంగ్ రేప్ కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కీలక విషయాలు రాబట్టినట్లు సమాచారం. హిందూపూర్‌కు చెందిన నలుగురిని అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారని తెలుస్తోంది. నిందితులంతా చిల్లర దొంగలని సమాచారం.