News July 14, 2024
8 మంది ఎంపీలను గెలిపించినా బీజేపీ తెలంగాణకు మొండి చేయి: వినోద్ కుమార్
8 మంది ఎంపీలను గెలిపించినా BJP తెలంగాణకు మొండి చేయి చూపిస్తోందని BRS నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ విమర్శించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలని విభజన చట్టంలోని 13వ షెడ్యూల్‌లో ఉందన్నారు. అదే షెడ్యూల్లో ఇచ్చిన హామీ మేరకు ఆయిల్ రిఫేనరీ కంపెనీని ఏపీకి ఇస్తున్నారని.. మరి తెలంగాణకు ఇచ్చిన హామీని ఎందుకు నెరవేర్చడం లేదని ప్రశ్నించారు.
Similar News
News October 11, 2024
గోదావరిఖని: ప్రేమ పెళ్లి.. యువకుడి హత్యకు దారి తీసింది!
ప్రేమ పెళ్లి <<14324262>>యువకుడి హత్య<<>>కు దారి తీసింది. పోలీసులు తెలిపిన వివరాలు.. యైంటిక్లయిన్ కాలనీలోని హనుమాన్‌నగర్ చెందిన అంజలికి భర్త, పిల్లలు ఉండగానే వినయ్‌ని ఇటీవల ప్రేమ వివాహం చేసుకుంది. ఈ విషయంలో కక్ష పెంచుకున్న మొదటి భర్తతో పాటు అంజలికి వరుసకు సోదరుడు పథకం ప్రకారం వినయ్‌ని హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ACP రమేశ్, CI ప్రసాద్ రావు కేసు నమోదు చేశారు.
News October 11, 2024
కరీంనగర్: నేడు కొత్తపల్లిలో సద్దుల బతుకమ్మ
రాష్ట్ర వ్యాప్తంగా అంతట ఏడు, తొమ్మిది రోజుల్లో సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తే కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పట్టణంలో మాత్రం పదో రోజు జరుపుకొంటారు. ఇది అనాదిగా వస్తున్న ఆచారం కావడంతో శుక్రవారం కొత్తపల్లిలో సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నారు. ఇప్పటికే మున్సిపల్ ఛైర్మన్ రుద్రరాజు, అధికారులు చెరువు కట్ట ప్రాంతంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లను చేశారు.
News October 11, 2024
పూలనే పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణది: ఆది శ్రీనివాస్
పూలనే పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణ రాష్ట్రానిదని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. సిరిసిల్ల మానేరు వాగు తీరంలో గురువారం సిరిసిల్ల మున్సిపల్ ఆధ్వర్యంలో బంగారు బతుకమ్మ సంబరాలు – 2024 పేరిట చేపట్టిన వేడుకలకు ముఖ్య అతిథిగా ఆది శ్రీనివాస్ హాజరై తిలకించారు. మన సంస్కృతి, సాంప్రదాయాలను ఇలాగే కొనసాగించాలని కోరారు.