News September 23, 2025

8 నిమిషాలు ఆగిపోయిన మెట్రో

image

హైదరాబాద్‌ మెట్రో రైలు సేవలు మరోసారి నిలిచిపోయాయి. మంగళవారం భరత్‌నగర్‌ స్టేషన్‌లో 8 నిమిషాలకి పైగా రైలు ఆగిపోయింది. సాంకేతిక కారణాల వల్ల నిలిచిపోయిందని మెట్రో అధికారులు చెబుతున్నారు. అప్పుడప్పుడు ఇలా టెక్నికల్ ఇష్యూస్ వస్తాయని, వాటిని ప్రయాణికులు అర్థం చేసుకోవాలని సూచించారు.

Similar News

News September 23, 2025

ఈనెల 28న ఎల్బీ స్టేడియంలో అతిపెద్ద బతుకమ్మ

image

ఈనెల 28న ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వం అతిపెద్ద బతుకమ్మ వేడుకలు నిర్వహించనుంది. ఇందులో భాగంగా 60 అడుగుల ఎత్తు ఉన్న బతుకమ్మను పూలతో తయారు చేయనున్నారు. ఈ వేడుకల్లో పది వేల మంది మహిళలు పాల్గొని బతుకమ్మ ఆడనున్నారు. ఇది గిన్నిస్‌ రికార్డుకు ప్రయత్నం కానుంది.

News September 23, 2025

నాంపల్లిలో రేపు జాబ్ మేళా

image

నాంపల్లి పరిధిలోని విజయనగర్ కాలనీలోని శాంతినగర్ గవర్నమెంట్ ఐటీఐ కళాశాల వద్ద ఉన్న ఎంప్లాయ్ మెంట్ కార్యాలయంలో బుధవారం జాబ్ మేళా నిర్వహించనున్నారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన అభ్యర్థులు డిగ్రీ పూర్తి చేసి ఉండి 25 ఏళ్ల లోపు వారై ఉండాలన్నారు. అభ్యర్థులు తగిన సర్టిఫికెట్లతో మేళాకు హాజరు కావచ్చని జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి జయశ్రీ తెలిపారు. మరిన్ని వివరాలకు నంబర్ 8977175394ను సంప్రదించవచ్చు.

News September 23, 2025

HYD: ఓ మేఘమా ఉరమకే ఈ పూటకి!

image

కొద్ది రోజులుగా HYDలో వాన యుద్ధం చేసినట్లు అనిపిస్తోంది. పంజాగుట్టలోని NIMS వద్ద సోమవారం వర్షం దంచికొట్టింది. ఉరుములు, మెరుపుల శబ్ధాలతో అంతా దద్దరిల్లిపోయింది. పిడుగులు పడుతున్నట్లు భయాందోళన మొదలైంది. ఇటువంటి వాతావరణం నగరవాసులకు సవాల్‌గా మారుతోంది. వరదలో ప్రయాణం, గమ్యం చేరడం గగనమైంది. ఉద్యోగుల కష్టాలు వర్ణణాతీతం. నగరవాసుల్లో ఈ ఒక్క పూట వాన పడకుంటే చాలు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.