News March 7, 2026
8 మంది MLAలకు క్లీన్ చిట్

TG: పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విచారణ ముగిసింది. 8 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్‌చిట్ ఇచ్చారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి కేసులో తీర్పును ఆయన రిజర్వ్ చేశారు.
Similar News
News March 29, 2026
ఇరాన్‌లో గ్రౌండ్ ఆపరేషన్‌కు US సిద్ధం!

పశ్చిమాసియాలో యుద్ధం మరో స్థాయికి చేరనుంది. ఇరాన్‌లో గ్రౌండ్ ఆపరేషన్‌కు వేలాది <<19503626>>US సైనికులు<<>> అక్కడికి చేరుకుంటున్నారు. ఖర్గ్ ద్వీపం, హార్ముజ్ జలసంధి సమీపంలోని స్థావరాలపై కొన్ని వారాలపాటు దాడులు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది. అయితే దీనికి ట్రంప్ అనుమతిచ్చారా లేదా అనేది క్లారిటీ లేదంది. ఆ ఆపరేషన్ పూర్తిస్థాయి దండయాత్రలా కాకుండా వ్యూహాత్మకంగా ఉంటుందని పేర్కొంది.
News March 29, 2026
MEGA158.. ఊర మాస్ లుక్‌లో చిరు?

‘వాల్తేరు వీరయ్య’ తర్వాత బాబీ-చిరంజీవి కాంబినేషన్‌లో తెరకెక్కే సినిమా(MEGA158) షూటింగ్ APR 20న ప్రారంభం కానున్నట్లు సమాచారం. యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా మూవీ ఉంటుందని, ఊర మాస్ లుక్‌లో మెగాస్టార్ కనిపిస్తారని టాలీవుడ్ టాక్. భారీ బడ్జెట్‌తో రూపొందే ఈ చిత్రంలో హీరోయిన్‌గా ప్రియమణి, చిరు కూతురుగా అనశ్వరా రాజన్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసే అవకాశం ఉంది.
News March 29, 2026
అత్యాచార బాధితుల పేర్లను తీర్పుల్లోనూ వాడరాదు: సుప్రీంకోర్టు

అత్యాచార బాధితులు, వారి కుటుంబీకుల పేర్లను తీర్పుల్లోనూ ప్రస్తావించరాదని అన్ని హైకోర్టులకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వారిని గుర్తించే అవకాశమున్న ఏ వివరాలనూ ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలో చెప్పరాదని 2018లోనే అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చిందంది. లైంగిక నేరాల బాధితులకు సమాజంలో ఇబ్బందులు కలగకుండా ఇలా చేసినట్లు పేర్కొంది. ఓ బాలిక వివరాలను HP హైకోర్టు ప్రస్తావించడాన్ని తప్పుపట్టింది.


