News December 24, 2024
8.3 కోట్ల బిర్యానీలు తినేశారు!
స్విగ్గీ 2024కు సంబంధించిన నివేదికను విడుదల చేసింది. జనవరి 1 నుంచి నవంబర్ 22 వరకు 83 మిలియన్ల ఆర్డర్‌లతో బిర్యానీ అత్యధికంగా ఆర్డర్ చేసిన వంటకంగా నిలిచింది. అందులోనూ హైదరాబాద్‌లో అత్యధికంగా 9.7 మిలియన్లు, బెంగళూరులో 7.7Mn ఆర్డర్స్ వచ్చాయి. ఇక 23Mn ఆర్డర్లతో దోశ రెండో డిష్‌గా నిలిచింది. కాగా అర్ధరాత్రి 12-2 మధ్యలో అధికంగా బిర్యానీలే బుక్ అయ్యాయి. ఇంతకీ మీరేం ఆర్డర్ చేశారు?
Similar News
News December 25, 2024
ఫిర్యాదు చేస్తే పట్టించుకోవట్లేదు.. హైకోర్టులో అంబటి పిటిషన్
AP: వైఎస్ జగన్‌తో పాటు తన కుటుంబసభ్యులపై అసభ్యకర పోస్టులు చేస్తున్న వారిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవట్లేదని అంబటి రాంబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పలువురు తనకు ఫోన్ చేసి చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఈ పిటిషన్ రేపు/ఎల్లుండి విచారణకు రానుంది. పార్టీ ఇన్‌పర్సన్‌గా రాంబాబు స్వయంగా వాదనలు వినిపించనున్నారు.
News December 25, 2024
కారు అమ్మితే 18% జీఎస్టీ.. వీరికి మాత్రమే
సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాలపై 18% జీఎస్టీ విధించడంతో నెటిజన్లు కేంద్రంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీనిపై జీఎస్టీ కౌన్సిల్ క్లారిటీ ఇచ్చింది. ఇది కేవలం రిజిస్టర్డ్ బిజినెస్ (డీలర్ల)కే వర్తిస్తుందని పేర్కొంది. వ్యక్తిగతంగా కారు అమ్మితే ఎలాంటి జీఎస్టీ ఉండదని తెలిపింది. అయితే డీలర్ చెల్లించిన ఆ పన్ను మొత్తాన్ని తిరిగి కస్టమర్ నుంచే వసూలు చేస్తారని, భారం తమకే అని పలువురు మండిపడుతున్నారు.
News December 25, 2024
హైదరాబాద్ వాసుల ఫేవరెట్ బ్రేక్‌ఫాస్ట్ ఇదే!
TG: హైదరాబాదీలు బ్రేక్‌ఫాస్ట్‌గా దోశ ఇష్టపడుతున్నారని, అందులోనూ ఉల్లిదోశపై ఎక్కువగా మక్కువ చూపుతున్నారని ఫుడ్ డెలివరీ ఫ్లాట్‌ఫాం స్విగ్గీ తెలిపింది. దేశంలో ఉదయం పూట ఎక్కువగా దోశను ఆర్డర్ చేసేది హైదరాబాద్ వాసులే అని ‘హౌ హైదరాబాద్ స్విగ్గీడ్’ నివేదికలో వివరించింది. అలాగే ప్రతి నిమిషానికి 34 బిర్యానీలను ఆర్డర్ చేస్తున్నట్లు తెలిపింది. అటు, హైదరాబాదీల ఫేవరెట్ స్వీటుగా ‘డబుల్ కా మీటా’ నిలిచింది.